E-Paper
Advertisement

Telangana Politics: బొగ్గు చుట్టూ తెలంగాణ రాజకీయాలు.. హరీష్‌రావు కామెంట్స్‌పై అద్దంకి కౌంటర్

Telangana Politics: బొగ్గు చుట్టూ తెలంగాణ రాజకీయాలు.. హరీష్‌రావు కామెంట్స్‌పై అద్దంకి కౌంటర్
Advertisement

Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు బొగ్గు టెండర్ల చుట్టూనే తిరుగుతున్నాయి. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి బీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.  తాజాగా హరీష్‌రావు చేసిన కామెంట్స్‌పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఇంతకీ వీరిద్దరి మధ్య సై అంటే సై అనే స్థాయికి చేరింది.

తెలంగాణలో బొగ్గు చుట్టూ రాజకీయాలు

Advertisement

రేపో మాపో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో బొగ్గు టెండర్ల వ్యవహారాన్ని పదే పదే తెరపైకి తెస్తోంది బీఆర్ఎస్ పార్టీ. దీనిపై ప్రతీరోజా ఆ పార్టీకి చెందిన ఒకరు లేదా ఇద్దరు కీలక నేతలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

బొగ్గు టెండర్ల వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమాక్క ఏ టు జెడ్ అంతా విడమరిచి మీడియా ముందు గుట్టు విప్పారు. అసలు టెండర్లు యవ్వారం ఎప్పుడు మొదలైంది? గత ప్రభుత్వాలు ఏం చేశాయి? ప్రతీది పాయింట్ టు పాయింట్ చెప్పారు. డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆధివారం మీడియా ముందుకొచ్చారు మాజీ మంత్రి హరీష్‌రావు.

Advertisement

హరీష్‌రావు కామెంట్స్‌పై అద్దంకి కౌంటర్

కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్‌రావు. గతేడాది మే నెలలో సైట్ విజిట్ సర్టిఫికేషన్ విధానం మొదలు పెట్టారని ప్రస్తావించారు. అప్పటి నుండి ఎంతమంది సైట్ విజిట్ చేశారు? ఎంతమందికి టెండర్లు కట్టబెట్టారు? బయటవాళ్లకి ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు? వాటిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చదివిన వాటిలో ఎక్కడా ఓబీ వర్క్ గురించి లేదన్నారు. దీనిపై ఉంటే చెప్పాలని, చూపించాలని డిమాండ్ చేశారు. ఓబీ పనులకు వర్తించని నిబంధనలు చూపించలేదన్నారు. ఇప్పుడు ఓబీ వర్క్ కు సంబంధించి సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తెచ్చారన్నారు.

ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎప్పడూ ఓబీ వర్క్స్ కు సైట్ సర్టిఫికెట్ విధానం లేదన్నారు. సీఎంపీడీఐ ఓబీ పనులకు ఉన్నట్లయితే, 2018లో వచ్చిందన్నారు. అనేక పనులకు సంబంధించి సింగరేణిలో టెండర్లు పిలిచిందని వాటికి సంబంధించి సర్టిఫికెట్ ఉంటే చూపించాలన్నారు.

ALSO READ: పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్!

మాజీ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ దయాకర్ కౌంటర్ ఇచ్చారు. హరీష్‌రావు అతి తెలివితో మతి భ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు చేస్తే బీఆర్ఎస్ నాయకులకు బొగ్గు టెండర్లు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. నాలుగు జరిగితే మూడు మీకు దక్కాయన్నారు.

నీ చుట్టాలు టెండర్లు వస్తే నీకు ముడుపులు ముట్టలేదని వ్యతిరేకిస్తున్నారా? అబద్ధాన్ని నిజం చేయడానికి బావ బామ్మర్దుల తాపత్రయం మామూలుగా లేదన్నారు. అందుకే మిమ్మల్ని బిర్లా-రంగా అనేదని, మీ మామనే నిన్ను పక్కన పెట్టారని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటారని అన్నారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×