E-Paper
Advertisement

Delhi News: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. రాహుల్-ప్రియాంకలతో సమావేశం, గ్లోబల్ సమ్మిట్‌పై చర్చ

Delhi News:  ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి..  రాహుల్-ప్రియాంకలతో సమావేశం,  గ్లోబల్ సమ్మిట్‌పై చర్చ
Advertisement

Delhi News: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. రాత్రి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో సమావేశమయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ రాజకీయాలతోపాటు, గ్లోబల్ సమ్మిట్ గురించి కీలక విషయాలను వారితో చర్చించినట్టు తెలుస్తోంది.

Advertisement

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈసారి పర్యటనలో పార్టీ పెద్దలతోపాటు పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఏఐసీసీ భవనానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బర్త్ డే సందర్భంగా అధినేత్రి సోనియా‌గాంధీని కలిసి జన్మదిన శుభాకాంక్షలుతెలిపారు.

ఇదే సమయంలో ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో ప్రైవేటు కార్యక్రమం జరిగింది. దానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. డిసెంబర్ 12న శరద్‌ పవార్‌ పుట్టిన రోజు. దాన్ని పురస్కరించు కుని ఢిల్లీలోని ఆయన నివాసంలో రాత్రి ప్రత్యేక విందు ఇచ్చారు.

రాహుల్-ప్రియాంకలతో సమావేశం

దీనికి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, అధికార ప్రతినిధులు, కీలక నేతలు హాజరయ్యారు. వారితో సీఎం రేవంత్రెడ్డి కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలు గురించి వివరించారు. ప్రస్తుతం జరిగిన.. జరుగుతున్న పరిణామాలు వివరించారు. దీనికితోడు గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిన నేపథ్యంలో వాటి గురించి వివరించినట్టు సమాచారం.

గురువారం పార్టీ కీలక నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశముందని పార్టీ వర్గాల మాట. శరద్ పవార్ ఇంట ఫంక్షన్‌కు మాజీ ఎంపీ మధు‌యాష్కీ హాజరయ్యారు. నేతలంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఫోటోలు దిగారు. అలాగే రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల గురించి కేంద్రమంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశముంది.

ALSO READ: గ్రామ పంచాయితీ ఎన్నికల బందోబస్తు.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఆదేశాలు

పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు. పార్టీ పరిస్థితులు, డీసీసీ అధ్యక్షుల నియామకాలు, కార్పొరేషన్‌ పదవుల భర్తీ లాంటి అంశాలపై చర్చించే అవకాశముందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×