E-Paper
Advertisement

CM Revanthreddy: విద్యుత్‌ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట ఫస్ట్..గజ్వేల్ సెకండ్ ..

Cm Revanthreddy

CM Revanthreddy: విద్యుత్‌ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట ఫస్ట్..గజ్వేల్ సెకండ్ ..
Advertisement

CM Revanthreddy: రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయగా జరిగిన చర్చా సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. విద్యుత్‌ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉందన్నారు. రెండు, మూడు స్థానాల్లో గజ్వేల్‌, హైదరాబాద్‌ సౌత్‌లు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘సిద్దిపేట, గజ్వేల్‌, హైదరాబాద్‌ సౌత్‌ నుంచి ఎన్నికైన వారే గత తొమ్మిదేళ్లు తెలంగాణను పాలించారన్నారు.

మాకు ఓల్డ్‌ సిటీ, న్యూ సిటీ అనే తేడాలేదు అందరిని ఒకే రకంగా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్బరుద్దీన్‌ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలని సూచించారు. సభలో ప్రస్తుతం 57 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌ను చేశామన్నారు. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది. అక్బరుద్దీన్‌ కేవలం ఎంఐఎం అధినేత మాత్రమే. ఆయనను మేం ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదన్నారు. చాంద్రాయణగుట్టలో హిందువులు కూడా ఆయనకు ఓటు వేశారని రేవంత్ తెలిపారు .

Advertisement

కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్‌కు టికెట్‌ ఇస్తే అక్బరుద్దీన్‌ ఓడించే ప్రయత్నం చేశారన్నారు. షబ్బీర్‌ అలీని ఎంఐఎం ఓడించాలని చూసిందన్నారు. బీఆర్ఎస్ దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా? బీఎర్ఎస్ ప్రోగ్రెస్‌ రిపోర్టు మాత్రమే చదువుతున్న అక్బరుద్దీన్‌కు లోపాలు కనిపించలేదా? అని అక్బరుద్దీన్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గత ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతూ ఉంటే వినడానికి మేము సిద్దంగా లేమని, ముస్లింల అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ కట్టుపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×