E-Paper
Advertisement

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్

Khairatabad Ganesh:  ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్
Advertisement

Khairatabad Ganesh: దేశంలో గణేశ్‌ ఉత్సవాలకు ఖైరతాబాద్‌ ప్రసిద్ధి చెందిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో పెద్ద విగ్రహాలు ఎన్ని ప్రతిష్టించినా ఖైరతాబాద్ మహా గణపతి క్రేజ్ వేరని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు.

ఒక్కసారి నిర్వహణ కష్టమైన ఈ రోజుల్లో.. ఎన్ని ఇబ్బందులున్నా  ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి దీన్ని కంటిన్యూ చేస్తోందన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం సీఎంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వినాయక మండపాలకు తొలిసారి ఉచితంగా విద్యుత్‌ ఇచ్చామన్నారు. ఈ ఘనత తమకే దక్కిందన్నారు.

Advertisement

భక్తుల మనోభావాలను ప్రభుత్వం గౌరవిస్తుందని, అన్ని పండుగలకు వేదిక హైదరాబాద్ అని చెప్పారు. అన్ని మతాలను గౌరవిస్తూ భాగ్యనగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సిటీలో లక్షా 40,000 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించినట్టు తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో సమస్యలు లేకుండా ఉత్సవాలను పూర్తి చేసుకున్నామని తెలిపారు.

ఈ ఉత్సవాలను విజయవంతంగా ముగించిన గణేశ్‌ ఉత్సవ సమితి సభ్యులను అభినందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తరపున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని వెల్లడించారు సీఎం. 71 ఏళ్ల కిందట గణేశ్‌ ఉత్సవ సమితి ఒక్క అడుగుతో గణేశుడి ఉత్సవాలను ప్రారంభించిందన్నారు.

Advertisement

ALSO READ: ఫామ్ హౌస్‌లో కేసీఆర్ గణపతి హోమం

ప్రస్తుతం 69 అడుగుల గణపతిని ఏర్పాటు చేయడం ఆశామాషీ వ్యవహారం కాదని, ఇలాంటి కార్యాన్ని ఒక్కరోజు చేయడం తలకు మించిన భారమన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు.

ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ లు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ పూలమాల వేసి హారతిచ్చారు. ఆ తర్వాత అర్చకులు సీఎం రేవంత్‌రెడ్డికి ఆశీర్వచనం ఇచ్చారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. భాగ్యనగరంలో గణేషుడి నిమజ్జనం గురువారం నుంచి కొనసాగుతోంది.

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×