E-Paper
Advertisement

CM Revanth Reddy Comments: సెమీ ఫైనల్లో గెలిచాం.. ఇక ఫైనల్లో గెలవాలి..

CM Revanth Reddy Comments: సెమీ ఫైనల్లో గెలిచాం.. ఇక ఫైనల్లో గెలవాలి..
Advertisement

CM Revanth Reddy Comments: మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావు సవాల్ ను స్వీకరిస్తున్నా.. ఆగస్టు 15 లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. హరీశ్ రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకో అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ తో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలన్నారు. సెమీ ఫైనల్ మ్యాచ్ లో బీఆర్ఎస్ పై గెలిచాం.. ఇక ఫైనల్ మ్యాచ్ లో బీజేపీపై గెలవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలవాలన్నారు. గెలుపు దిశగా అడుగులు వేయాలని సూచించారు.

Advertisement

Also Read:బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ.. నమో అంటే నమ్మించి మోసం చేయడం: సీఎం రేవంత్ రెడ్డి

ఇస్డిండియా కంపెనీ తరహాలో బీజేపీ దేశాన్ని ఆక్రమించాలని చూస్తోందని.. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసేస్తుందని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం దేవుడితో రాజకీయం చేస్తున్నారని.. అయితే, దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలన్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×