E-Paper
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో.. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో.. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!
Advertisement

CM Revanth Reddy: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్లెల్లో సందడి వాతావరణ నెలకొంది. సర్పంచ్ ఆశావహులు ఏకగ్రీవాలపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఈ మేరకు గ్రామస్తులను ఒప్పించేందుకు వివిధ హామీలు కురిపిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయింది. అయితే ఇక్కడ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలిపారు.

సర్పంచ్ ఆశావహులు ఏకగ్రీవాలపై పార్టీ నేతల దృష్టి
నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వేషన్ ప్రకటించిన వెంటనే.. సర్పంచ్ పదవి కోసం 15 మంది పోటీ పడ్డట్లు తెలుస్తోంది. పంచాయతీని ఏకగ్రీవం చేసేందుకు స్థానిక నాయకులు కసరత్తు చేపట్టారు.

Advertisement

అన్నీ వార్డు సభ్యుల పదవులకు ఒక్కో నామినేషన్ దాఖలు..
స్థానిక నాయకులు గ్రామస్థులంతా ఏకాభిప్రాయానికి వచ్చి, సర్పంచిగా మల్లెపాకుల వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తీర్మానించినట్లు సమాచారం. కేవలం సర్పంచి పదవికే కాకుండా, అన్ని వార్డు సభ్యుల పదవులకు ఒక్కో నామినేషన్‌ దాఖలు చేయించి, మొత్తం పాలకవర్గాన్ని పోటీ లేకుండా ఎన్నుకోవాలని స్థానికులు నిశ్చయించినట్లు తెలుస్తోంది.

Also Read: అంబానీ, అదానీల రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా.. ఉదయ్‌పూర్‍‌లో ఓ తెలుగమ్మాయి పెళ్లి..

Advertisement

బలమైన రాజకీయ సమన్వయం..
ఈ ఏకాభిప్రాయం వెనుక బలమైన రాజకీయ సమన్వయం కనిపిస్తుంది. ఎస్సీ రిజర్వేషన్ స్థానానికి మల్లెపాకుల వెంకటయ్యను ఏకగ్రీవ అభ్యర్థిగా ఎంచుకోవడం అనేది స్థానిక రాజకీయ వర్గాల మధ్య పూర్తి ఏకాభిప్రాయానికి దారితీసింది. ఈ ప్రక్రియలో సీఎం కుటుంబానికి, స్థానిక నాయకులకు మధ్య ఉన్న సమన్వయం స్పష్టమవుతుంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×