E-Paper
Advertisement

CM Revanth Reddy: తల తాకట్టు పెట్టైనా నిధులు తెస్తా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: తల తాకట్టు పెట్టైనా నిధులు తెస్తా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Advertisement

CM Revanth Reddy:  తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో: అభివృద్ధి పనుల కోసం తల తాకట్టు పెట్టైనా నిధులు తెస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.  ఆయన కూకట్ పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో  మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్ పల్లికి రావడం సంతోషంగా ఉన్నదన్నారు. కష్టకాలంలో మల్కాజ్ గిరి ప్రజలు తనను ఆదుకున్నారన్నారు. వారి కోసం ఏం చేసినా తక్కువేనంటూ సీఎం వివరించారు. రాజకీయాలకు అతీతంగా మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తా నని హామీ ఇచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకెళ్లడమే తమ విధానం అన్నారు.

Also Read: Gundeninda GudiGantalu Today episode: ఇంట్లోంచి వెళ్లిన శృతి.. రవి, శృతి కాపురంలో ప్రభా చిచ్చు.. ప్రభావతికి మీనా స్ట్రాంగ్ కౌంటర్..

మహిళలకు స్టాల్స్ ఏర్పాటు

Advertisement

చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నప్పుడు ఎంతమంది ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా మౌనంగా భరించా నని, నల్ల చెరువు అభివృద్ధిని చూసాక ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూస్తే తనకు ఆ విమర్శలు ఆశీర్వాదంగా మారినట్లు కనిపిస్తోందన్నారు. పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, వరదలు వచ్చినపుడు ముంపు బాధితులుగా మిగలకూడదు అనేది తమ తపన అన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారికి తప్పకుండా న్యాయం చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నదన్నారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. చిన్నారుల కోసం చెరువుల ఒడ్డున ఆటస్థలాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.

అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి తాము సిద్ధం

నగరంలోని చెరువులన్నింటినీ పునరుద్దరించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశంలో మహానగరాలు సమస్యలతో సతమతమవుతున్నాయని, అందుకే మన నగరంలో ప్రకృతిని కాపాడుకుని చెరువులను పునరుద్ధరించుకుందామన్నారు. మూసీ నది ప్రక్షాళన చేసుకుందామన్నారు. కోర్ అర్బన్ రీజియన్ లో ఉన్న చెరువులన్నీ పునరుద్ధరించుకుందామని, నాలాల ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇక రోడ్ల విస్తరణ చేపడుదామన్నారు. ఒక మంచి నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చి దిద్దుకుందామన్నారు. అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని, ఇప్పుడు కాకపోతే అభివృద్ధి చేసే అవకాశం రాదన్నారు. మల్కాజ్ గిరి ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా…తన దృష్టికి తీసుకురావాలని సీఎం చెప్పారు. మల్కాజ్ గిరి ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసే అవకాశాన్ని పొందినట్లు సీఎం గుర్తు చేసుకున్నారు.

Advertisement

Also Read: Thriller movie OTT: చచ్చినా చావని అమ్మాయి… డిటెక్టివ్ లకే ముప్పుతిప్పలు పెట్టే కేసు… ఉత్కంఠ రేపే ప్రతీ ఎపిసోడ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×