E-Paper
Advertisement

Cm Revanth Reddy On Musi: హైద‌రాబాద్ కు మూసీ వ‌రం కావాలి.. శాపం కావ‌ద్దు.. సీఎం రేవంత్ ఎమోష‌న‌ల్

Cm Revanth Reddy On Musi: హైద‌రాబాద్ కు మూసీ వ‌రం కావాలి.. శాపం కావ‌ద్దు.. సీఎం రేవంత్ ఎమోష‌న‌ల్
Advertisement

Cm Revanth Reddy On Musi: హైద‌రాబాద్ కు మూసీ వ‌రం కావాలి కానీ శాపం కావ‌ద్దొని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవంపై ఎక్స్ పోస్టులో సీఎం ఎమోష‌న‌ల్ అయ్యారు. న‌దుల వెంట నాగ‌రిక‌త వ‌ర్థిల్లాల‌ని, వాటిని క‌నుమ‌రుగ‌య్యేలా చేస్తే మ‌నిషి మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కం అవుతుంద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జారోగ్యం, ప‌టిష్ఠ ఆర్థిక‌ ప‌ర్యావ‌ర‌ణ కోణాల్లో ప్ర‌పంచస్థాయి ప్ర‌మాణాల‌తో అభివృద్ది చెందాల్సిన హైద‌రాబాద్ కు మూసీ ఒక వ‌రం కావాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ శాపంలా మార‌కూడ‌ద‌ని చెప్పారు.

Also read: నిండా ముంచింది మందుబాబులే.. ఎంత పని చేస్తిరయ్యా.. వైసీపీ నేత కీలక కామెంట్స్

Advertisement

మూసీని ప్ర‌క్షాళ‌న చేయాల‌న్న‌దే తమ ప్ర‌భుత్వ సంక‌ల్పం అని తెలిపారు. ఇది ఈ త‌రానికే కాదు, భావి త‌రాల‌కు సైతం మేలు చేసే నిర్ణ‌యం అని పేర్కొన్నారు. ఈ నిర్ణ‌యానికి అండ‌గా నిలిచే వ్య‌క్తికి, వ్య‌వ‌స్థ‌కు ప్ర‌త్యేక కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్ర‌భుత్వం మూసీ ప్ర‌క్షాళ‌న నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో నివ‌సించే వారిని ఖాళీ చేయాల‌ని కోరుతున్న సంగ‌తి తెలిసిందే. ఖాళీ చేసిన వారిని డ‌బుల్ బెడ్రూ ఇండ్ల‌కు త‌ర‌లిస్తూ వారికి నివాసం క‌ల్పిస్తోంది.

అంతే కాకుండా ప‌ర్మిష‌న్ ఉన్న ఇండ్ల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో కొంత‌మంది మాత్రం మూసీ ప్రాంతం నుండి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. దీంతో ప్ర‌భుత్వంపై విమర్శ‌లు వ‌స్తున్నాయి. కూల్చివేత‌లు స‌రికాద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ అనేక‌సార్లు మూసీ ప్ర‌క్షాళ‌న ఎందుకు చేస్తున్నారో చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు మ‌రోసారి సోష‌ల్ మీడియా వేధిక‌గా మూసీ అంశంపై పోస్టు పెడుతూ ఎమోష‌న‌ల్ అయ్యారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×