E-Paper
Advertisement

కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. ధరలు తగ్గిచాలని డిమాండ్!

కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. ధరలు తగ్గిచాలని డిమాండ్!
Advertisement

CM Revanth Reddy: కేంద్రం ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం సమర్థనీయం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదని దీని వలన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు.

గత ఎన్నికల్లో..

దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని అన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైందని అన్నారు. ఇటీవల దేశంలో జరిగిన పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చెరి, అస్సాం, తమిళనాడు ఎన్నికలకు ముందు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచుతామని గతంలో మోదీ ప్రభుత్వం పదే పదే ప్రకటించిందని అన్నారు.

Advertisement

Also read: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్!

పది రోజులు కాకుండానే..

ఎన్నికలు జరిగిపోయి ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే రూ.3 పైగా ధరలు పెంచడం దేశంలో ప్రజల నమ్మకాన్ని వంచించడమేనని అన్నారు. దేశంలో కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్దాలు చెబుతారని ప్రజలను ఇలా మొసం చేస్తున్నారని అలా భావిస్తున్నారని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

Advertisement

Also read: బిల్డర్ నిర్లక్ష్యం.. బలి తీసుకున్న చిన్నారి ప్రాణం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×