E-Paper
Advertisement

టార్గెట్ మెట్రో ఫేజ్-2.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ.. రైల్వే మంత్రితో భేటికి డిమాండ్

టార్గెట్ మెట్రో ఫేజ్-2.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ.. రైల్వే మంత్రితో భేటికి డిమాండ్
Advertisement

CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలను తేల్చాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ రాశారు. ఈ విషయమై చర్చించేందుకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని పట్టుబట్టారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన అంశాలు త్వరితగతిన పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇటీవల 16వ తేదీన రాసిన లేఖను తాజా లేఖలో సీఎం ప్రస్తావించారు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఐఆర్‌ఎఫ్‌సీ నిధుల విడుదలకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారం, మెట్రో ఫేజ్-2 అమలు తదితర కీలక అంశాలను తాజా లేఖలో రేవంత్ వివరించారు. జూన్ 22, 23 తేదీలలో తాను న్యూఢిల్లీ పర్యటనలో ఉండనున్నట్లు కిషన్ రెడ్డికి తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. మీతో పాటు అశ్విని వైష్ణవ్‌ ని కలిసి మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి చర్చించాలని భావిస్తున్నట్లు కిషన్ రెడ్డికి చెప్పారు.

Advertisement

Also Read: అయ్యబాబోయ్.. కూలర్‌లో దూరిన పాము.. చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నదని కిషన్ రెడ్డికి సీఎం గుర్తుచేశారు. పెండింగ్ అంశాలు సత్వరం పరిష్కారం కావాలని అభిలషించారు. అశ్వినీ వైష్ణవ్ తో చర్చించి మెట్రోకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. చర్చలకు అవసరమైన సంబంధిత ఒప్పందాలు, ఇతర పత్రాల ప్రతులను కూడా వెంట తీసుకువస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమావేశ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుని, సమావేశానికి సంబంధించిన వివరాలను వీలైనంత త్వరగా తెలియజేయాలని లేఖలో కిషన్ రెడ్డికి సూచించారు.

Advertisement

Also Read: కర్నూలు గడ్డ.. బంగారం అడ్డా.. దేశం చూపు ఇప్పుడు ఏపీ వైపే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×