E-Paper
Advertisement

దక్షిణాది రాష్ట్రాలపై కుట్రల గుట్టు విప్పిన సీఎం రేవంత్.. అంబేద్కర్ జయంతి ఈవెంట్‌లో కీలక వ్యాఖ్యలు

దక్షిణాది రాష్ట్రాలపై కుట్రల గుట్టు విప్పిన సీఎం రేవంత్.. అంబేద్కర్ జయంతి ఈవెంట్‌లో కీలక వ్యాఖ్యలు
Advertisement

Hyderabad: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో 50 శాతం ప్రాతిపదికన సీట్లు పెంచుతామని తొలుత చెప్పారని, ఇప్పుడు రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించాలని చూస్తోందన్నారు.

దక్షిణాది రాష్ట్రాలపై కుట్రల గుట్టు విప్పిన సీఎం రేవంత్

Advertisement

అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిన్న లెక్క కేంద్రమంత్రులుగా ఉన్నవాళ్ళకి తెలియదా? అంటూ ప్రశ్నలు సంధించారు. కేరళ-ఉత్తరప్రదేశ్ మధ్య సీట్ల తేడా 60 సీట్లు మాత్రమేనని, కేంద్ర పెద్దలు చెబుతున్న ప్రకారం.. రేపటి రోజున కేరళంలో 30 ఎంపీ సీట్లు వస్తే.. యూపీలో 120 సీట్లు అవుతుందన్నారు.

ఈ అంతరం 60 నుంచి 90 సీట్లకు పెరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంత విలువ ఉందో వాజ్‌పేయి సర్కార్ కూలినప్పుడు తెలిసిందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తరాధి దళితులు, గిరిజనులకు సీట్లు పెరగొచ్చన్నారు. సీట్లు తగ్గడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో దళితులకు, గిరిజనులకు, మహిళలకు నష్టం జరుగుతుందని వివరించారు.

Advertisement

తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో రెండు ఎస్టీలకు, మూడు ఎస్సీలకు ఉన్నాయన్నారు. ఇవి 30 సీట్లు అయితే ఎస్సీలకు ఆరు, ఎస్టీలకు నాలుగు వస్తాయన్నారు. అదే 25 సీట్లు ఎంటే ఈ సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ లెక్క కేంద్రంలోని మంత్రులకు తెలీదా? అంటూ ప్రశ్నించారు.

అంబేద్కర్ జయంతి ఈవెంట్‌లో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

మంగళవారం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అని అంబేద్కర్ చెప్పారని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంచి పనికి మా ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు.

ఈ ప్రభుత్వం మీది.. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదేనని అన్నారు. రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మా‌గాంధీ నిరూపించారని అన్నారు. దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని నిరూపించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు చేశారు.

గాంధీ పాత్ర ఎంత ఉందో, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో అంబేద్కర్ పాత్ర అంతే ఉంద్నారు. దేశానికి రెండు కళ్లు మహాత్మాగాంధీ,అంబేడ్కర్ అని అన్నారు. ఆయన ఆలోచనలను ప్రపంచం అనుసరిస్తోందని, విద్య ఒక్కటే మన జీవితాలని మారుస్తుందని అంబేద్కర్ బలంగా నమ్మారని తెలిపారు.

ALSO READ: అమ్మో బీజేపీ పార్టీలోకా జంకుతున్న నేతలు.. కాషాయ గూటికి కష్టకాలం మొదలైనట్టేనా..?

ఆర్టికల్-3 ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాలే ముఖ్య పాత్ర పోషించాయని అన్నారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన గద్దరన్న పాత్రను మరిచిపోతారని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమనని అన్నారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాసిన అందేశ్రీ మనవాడు కాదా?

ఆనాటి పాలనతో పోలిస్తే ప్రజా ప్రభుత్వంలో దళితులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. దళిత బిడ్డ స్పీకర్‌గా ఉన్నారని, ఆయన అసెంబ్లీకి రాకుండా అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. దళిత బిడ్డలు ఆర్ధికమంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండొద్దా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. అన్ని రంగాల్లో దళిత గిరిజనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలియజేశారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×