E-Paper
Advertisement

CM Revanth Reddy: ట్రాఫిక్ నిబంధనలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం, ఇక అకౌంట్ నుంచే డబ్బులు కట్

CM Revanth Reddy: ట్రాఫిక్ నిబంధనలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం, ఇక అకౌంట్ నుంచే డబ్బులు కట్
Advertisement

రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ స్టేడియంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ట్రాఫిక్ నిబంధనల అమలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంటే.. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చలాన్లపై ఇక డిస్కౌంట్లు ఉండవు

Advertisement

ట్రాఫిక్ చలాన్ల విషయంలో వాహనదారుల ఆలోచనా విధానం మారాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘చలాన్లు పడినా ప్రభుత్వం ఎలాగూ డిస్కౌంట్లు ఇస్తుంది కదా’ అనే నిర్లక్ష్యం ప్రజల్లో పెరిగిపోయిందని.. ఇది ప్రమాదాలకు దారితీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే, ఇకపై ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని అధికారులను ఆదేశించారు.

బ్యాంకు ఖాతాల నుంచి ఆటోమేటిక్ కటింగ్

Advertisement

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు సీఎం ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని బ్యాంకు ఖాతాను లింక్ చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా మొత్తం నేరుగా ఆ ఖాతా నుండి కట్ అయ్యేలా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. దీనికోసం బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు తెలిపారు.

తల్లిదండ్రులపై కేసులు.. నూతన చట్టం

మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై సీఎం మండిపడ్డారు. మైనర్లు ప్రమాదాలకు కారకులైతే, వారి తల్లిదండ్రులపైనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను కేవలం ప్రమాదాలుగా చూడలేమని, అవి మనుషులు చేసే తప్పిదాల వల్ల జరుగుతున్న హత్యలే అని ఆయన వ్యాఖ్యానించారు. శాంతిభద్రతల సమస్య కంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదాలే పెద్ద సవాలుగా మారాయన్నారు.

పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన

హైడ్రా (HYDRAA), ఈగల్, సైబర్ క్రైమ్ విభాగాలను బలోపేతం చేసినట్టే, ట్రాఫిక్ విభాగాన్ని కూడా పటిష్టం చేయాలని సీఎం అన్నారు. పాత రవాణా విధివిధానాలను ప్రక్షాళన చేసి, అవసరమైతే నూతన చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. ఈ చట్టం, నిబంధనల గురించి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం వంటి వాటిపై పోలీసులు రాజీలేని పోరాటం చేయాలని సీఎం పిలుపునిచ్చారు.

ALSO READ: Telangana DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుక మామూలుగా లేదుగా..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×