E-Paper
Advertisement

Telangana : గోశాలలపై సీఎం రేవంత్ ఫోకస్.. బీజేపీకి చెక్?

Telangana : గోశాలలపై సీఎం రేవంత్ ఫోకస్.. బీజేపీకి చెక్?
Advertisement

Telangana : బక్రీద్‌కు ముందు తెలంగాణలో గోవధపై పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. గోవుల అక్రమ రవాణా, బలవంతంగా ఆవులను కబేళాలకు తరలిస్తున్నారంటూ గో సంరక్షకా దళాలు రచ్చ చేస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎప్పటిలానే సీన్‌లోని వచ్చారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ఆదేశించారు.

50 ఎకరాలకు తగ్గకుండా..

Advertisement

గోవుల సంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేలా.. విశాలంగా గోశాలల ఏర్పాటు ఉండాలన్నారు ముఖ్యమంత్రి. మొదటిదశలో తెలంగాణలోని వెటర్నరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, దేవాలయాలు, కాలేజీలకు చెందిన భూముల్లో గోశాలల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కనీసం 50 ఎకరాలకు తగ్గకుండా.. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని ఆదేశించారు.

ఆధునిక సౌకర్యాలతో..

Advertisement

ఇరుకు స్థలాల్లో, బంధించినట్టుగా కాకుండా.. గోవులు మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు, బడ్జెట్ అంచనాలు సిద్ధం చేయాలన్నారు. నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

సరికొత్త డిజైన్

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు సీఎం రేవంత్‌రెడ్డి. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులు చెప్పారు. నాలుగైదు రోజుల్లోగా తుది మోడల్‌ను ఖరారు చేయనుంది సర్కారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×