E-Paper
Advertisement

Hyderabad News: బాలుడిపై కుక్కలు దాడి ఘటన, సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు

Hyderabad News: బాలుడిపై కుక్కలు దాడి ఘటన, సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు
Advertisement

Hyderabad News: హయత్‌నగర్‌లో మూగ బాలుడిపై వీధి కుక్కలు దాడి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన తక్షణ సాయం అందించాలని సూచించారు.

బాలుడిపై కుక్కలు దాడి ఘటన

Advertisement

హయత్‌నగర్‌లోని శివగంగ కాలనీలో మూగబాలుడి ప్రేమ్‌చంద్‌పై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ వార్త గురించి స్పందించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. దీనికి సంబంధించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచన చేశారు.

అలాగే వీధి కుక్కల కట్టడి కోసం వెంటనే చర్యలు అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు-చంద్రకళ దంపతులు హయత్‌నగర్‌లోని శివగంగ కాలనీలో ఉంటున్నారు. ఈ దంపతులకు కొడుకు ప్రేమ్‌చంద్‌ ఉన్నాడు. పుట్టుకతో బాలుడు మూగ.

Advertisement

సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు

మంగళవారం ఆ బాలుడిపై 15 నుంచి 20 వీధి కుక్కలు ఒకేసారి తరుముతూ దాడి చేశాయి. బాలుడి దుస్తులు కొరికేసి మరీ దారుణంగా కరిచాయి. కుక్కల దాడిని గమనించిన ఓ స్థానికుడు కర్ర సాయంతో వాటిని బెదిరించాడు. వెంటనే 108 కు సమాచారం ఇచ్చారు. గాయపడిన బాలుడ్ని నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రి తీసుకున్నారు పేరెంట్స్.

ఆ తర్వాత వైద్యుల సూచనతో నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వార్డులో ఉంచి బాలుడికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కుక్కల దాడిలో బాలుడి చెవి తెగినట్టు తెలుస్తోంది. తల, నడుము, వీపు భాగంలో గాయాలయినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ALSO READ: తెలంగాణ జోలికొస్తే ఎవరైనా సరే.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటు వార్నింగ్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆసుపత్రిలో ఉన్న బాలుడ్ని పరామర్శించిన జీహెచ్ఎంసీ కమిషనర్, వెటర్నరీ అధికారులు. వీధి కుక్కలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో వీధి కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణాన్.

మంగళవారం వీధి కుక్కల దాడి వ్యవహారంపై జీహెచ్ఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాటి సంరక్షణకు మార్గదర్శకాలు పాటించాలని పేర్కొంది. ఇకపై చురుగ్గా వ్యవహరించాలని నొక్కి వక్కానించింది హైకోర్టు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×