E-Paper
Advertisement

Mahesh Kumar Goud: డ్రగ్స్ టెస్టులకు రేవంత్ రెడ్డి సిద్ధం.. కేసీఆర్, కేటీఆర్ వస్తారా?: మహేశ్ కుమార్ గౌడ్ సవాల్

Mahesh Kumar Goud: డ్రగ్స్ టెస్టులకు రేవంత్ రెడ్డి సిద్ధం.. కేసీఆర్, కేటీఆర్ వస్తారా?: మహేశ్ కుమార్ గౌడ్ సవాల్
Advertisement

Mahesh Kumar Goud: స్వేచ్ఛ బ్యూరో:  డ్రగ్స్ టెస్ట్ కు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. మంగళవారం ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ…కేసీఆర్ కూడా డ్రగ్ టెస్టుకు రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. మిగతా ప్రజాప్రతినిధులంతా డ్రగ్స్ టెస్టులు చేయించుకొని ప్రజలకు ఆదర్శంగా ఉండాలని కోరారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎంత పెద్ద వాళ్లనైనా డ్రగ్స్ అంశంలో వదిలిపెట్టెది లేదన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి దిశను చూపించేలా గవర్నర్ ప్రసంగం ఉన్నదన్నారు.

Also Read: Rice Water: అన్నం వండిన గంజిని పారేస్తున్నారా? ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలుసా?

అభివృద్ధి, సంక్షేమ‌మే ధ్యేయం

Advertisement

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల దిశను స్పష్టంగా ఆ ప్రసంగం ప్రతిబింబించిందన్నారు. ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధి, మహిళల సాధికారత,యువతకు ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గవర్నర్ వివరంగా వివరించారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గవర్నర్ ప్రస్తావించడాన్ని ప్రతిపక్ష సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికలు గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ ప్ర‌భుత్వం అభివృద్ధి, సంక్షేమ‌మే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తోందన్నారు. అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తిని ఆకాంక్షిస్తు తమ ప్ర‌యాణం కొనసాగుతోందన్నారు. ఇక తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డా.నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ 2025 పురస్కారం లభించడం పట్ల టీపీసీసీ చీఫ్​ హర్షం వ్యక్తం చేశారు.

Also Read: Sour Curd: వేసవిలో పెరుగు త్వరగా పులుస్తుందా? తాజాగా ఉండేందుకు ఇలా చిన్న పని చేయండి చాలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×