E-Paper
Advertisement

CM Revanth Reddy: నేరాల విధానం మారుతోంది.. డీప్‌ఫేక్‌తో చాలా ప్రమాదమన్న సీఎం రేవంత్

CM Revanth Reddy: నేరాల విధానం మారుతోంది..  డీప్‌ఫేక్‌తో చాలా ప్రమాదమన్న సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy: నేరాల విధానం చాలా వేగంగా మారుతుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఒకప్పుడు దేశంలో హత్యలు,దోపిడీ‌లు తీవ్ర నేరాలుగా పరిగణించేవారని చెప్పారు. ఇప్పుడు అత్యంత నేరం సైబర్ క్రైమ్ అని అన్నారు. పోలీస్ అధికారులు నిరంతర కృషితో తెలంగాణ‌లో సైబర్ నేరాలు కట్టడి చేస్తున్నామన్నారు.

సైబర్ క్రైమ్‌‌ను నియంత్రించడంలో దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేరం జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం కన్నా, నేరం జరగకుండా నిరోధించేలా అడుగులు వేయాలన్నారు.

Advertisement

హైదరాబాద్ HICCలో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ – 2025 (షీల్డ్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణను సైబర్ సేఫ్టీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశం మొత్తం ఒక తాటిపైకి వచ్చి సైబర్ క్రైమ్‌పై పోరాటం చేయాల్సి అవసరాన్ని నొక్కి వక్కానించారు.

డీప్ ఫేక్ న్యూస్‌తో ప్రమాదం పొంచి ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తప్పుడు వార్తల విషయంలో సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలని, అలాంటి సమాచారం సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. అలాగే ఆర్థిక నేరాలను నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదామన్నారు.

Advertisement

ALSO READ: పాస్టర్ సాయంతో రూ.100 కోట్ల స్కామ్.. మెటాప్లస్ మోసం వెనుక..

సమాజంలో వస్తున్న మార్పులు, సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచన చేశారు సీఎం. సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. సైబర్ క్రైం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో 14 రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాల నిరోధానికి దేశం మొత్తం యూనిట్‌గా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులను అభినందించారు సీఎం రేవంత్‌రెడ్డి.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×