E-Paper
Advertisement

CM Revanth Reddy Launching: ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుని ప్రారంభించిన సీఎం.. ఇదే మీ ఆధారం, రక్షణ కవచం కూడా

CM Revanth Reddy Launching: ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుని ప్రారంభించిన సీఎం.. ఇదే మీ ఆధారం, రక్షణ కవచం కూడా
Advertisement

CM Revanth Reddy Launching: వన్ స్టేట్.. వన్ కార్డు విధానంతో ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కుటుంబానికి రక్షణ కవచంగా ఈ డిజిటల్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు పొందవచ్చన్నారు.

ఇకపై ఫ్యామిలీ డిజిటల్ కార్డే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రైతు బీమా కార్డు అని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మీ పథకాలు అమలవుతాయని చెప్పుకొచ్చారు. గురువారం సికింద్రాబాద్​ సిక్ విలేజీ ప్రాంతంలోని హాకీ మైదానంలో కుటుంబ గుర్తింపు, డిజిటల్​ కార్డు పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు సీఎం.

Advertisement

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇవాళ్టి నుంచి 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామని, ప్రతీ పేదవాడికి రేషన్ కార్డు అందించాలని ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కొంతమందికి రేషన్ కార్డుకి, ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు తేడా తెలియకపోవడం దురదృష్టకరమన్నారు సీఎం. 30 శాఖల సమాచారంతో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.

Advertisement

ALSO READ: ఇంటింటికీ వెళ్ళాల్సిందే.. సారీ చెప్పాల్సిందే.. లేకుంటే కేసు వేస్తా.. మంత్రి వ్యాఖ్యలపై రెచ్చిపోయిన పాల్

ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ కూడా పొందుపరుస్తామని, ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చామన్నారు సీఎం. ప్రతీ నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని పర్యవేక్షణగా నియమిస్తున్నామని, ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళనే కుటుంబ పెద్దగా పొందుపరుస్తున్నామని వివరించారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×