E-Paper
Advertisement

CM Revanth: పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ అమెరికా టూర్.. ఐటీ ప్రతినిధులకు పిలుపు

CM Revanth: పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ అమెరికా టూర్.. ఐటీ ప్రతినిధులకు పిలుపు
Advertisement

CM Revanth Reddy America Tour(Telangana today news): తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. డల్లాస్ లో నిర్వహించిన ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటీ సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం కావాలని కోరారాయన. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మక హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నామని సీఎం అన్నారు. ప్రపంచస్థాయి నాలుగో ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ లో ఇప్పుడు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు సీఎం.

రాబోయే దశాబ్దంలో హైదరాబాద్‌ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి చేయటంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణను 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు శ్రీధర్ బాబు.

Advertisement

Also Read : హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. చార్లెస్ స్క్వాబ్.. దేశంలో తొలి సెంటర్‌కు ప్లాన్

అమెరికాలోని అన్ని ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీల గొంతుకగా.. ఈ అలయెన్స్​ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది చివర్లో వేగాస్‌లో ఐటీ సర్వ్ అలయెన్స్ వార్షిక ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షులు సహా పలువురు పేరొందిన లీడర్లు పాల్గొంటారు. బిల్ క్లింటన్, జార్జ్ బుష్, హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలు హాజరవుతారు. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని అలయెన్స్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×