E-Paper
Advertisement

Hyderabad News: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహణ

Hyderabad News: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహణ
Advertisement

Hyderabad News: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చరిత్రలో నిలిచిపోయేలా అనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ఆయా ఏర్పాట్లను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేశారు? ఏ విధంగా ఉన్నాయి అనేది అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ స్థాయిలో తెలంగాణ సమ్మిత్ ఎప్పుడూ జరగలేదని అంటున్నారు కొందరు అధికారులు.

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు

Advertisement

అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షణ, తెలంగాణ రైజింగ్ విజన్ డ్యాకుమెంట్ ఆవిష్కరణ నేపథ్యంలో ఏర్పాట్లు అద్భుతంగా ఉండాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమిట్‌ కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాటు బాగుండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.

శనివారం సాయంత్రం హెలికాప్టర్‌లో ఫ్యూచర్ సిటీకి వచ్చారు ముఖ్యమంత్రి. తొలుత ఏరియల్‌ వ్యూ ద్వారా ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత ప్రాంగణంలో వేదికలు, ఇతర నిర్మాణ పనులను దాదాపు గంటకు పైగానే పరిశీలించారు. పనుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మార్పులపై ఆయన పలు సూచనలు చేశారు.

Advertisement

స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి, పలుచోట్ల మార్పులు

సమిట్‌ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. వివిధ సమావేశాల వేదికలు, వాటిపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ కోసం ఏర్పాటు చేసిన తెరలు దగ్గరుండీ పరిశీలన చేశారు. సీటింగ్‌ ఏర్పాట్లపై సూచనలు చేశారు. మూసీ పునరుజ్జీవంపై ఏర్పాటు చేసిన డిజిటల్‌ చిత్రాలను స్వయంగా వీక్షించారు.

వచ్చే అతిథుల కోసం సదుపాయాలు, ఇంటర్‌నెట్, వాహనాల రాకపోకలకు రహదారులు వివరాలు తెలుసుకున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన వసతి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ALSO READ: కేఫ్ నిలోఫర్ నుంచి టీటీడీ బర్డ్ ట్రస్ట్‌కు రూ. 10 లక్షల విరాళం

రెండేళ్లలో రేవంత్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు 2037-విజన్, 2047-విజన్‌‌కు సంబంధించి ప్రభుత్వ లక్ష్యాలను ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి వివరించనున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దవుతున్నాయి. అయితే గ్లోబల్‌ సమిట్‌కు వస్తున్న అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు సీఎం. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చర్చించారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×