E-Paper
Advertisement

CM Revanth Reddy: 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆతిథ్యం

CM Revanth Reddy: 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆతిథ్యం
Advertisement

CM Revanth Reddy: హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీ టూంబ్‌ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు CM రేవంత్ రెడ్డి ఆతిధ్యం ఇచ్చారు. ఈ ఆతిథ్యానికి అమెరికా,ఇరాన్,తుర్కియే, UAE, UK, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక ,బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నిస్తుందన్న సీఎం రేవంత్.. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయుటకు ముందుకు రావాలని కోరారు.

స్వాతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరా గాంధీనీ స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఇక అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి..తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆతిధ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు.

Advertisement

.

.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×