E-Paper
Advertisement

CM Revanth Reddy : ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ .. సీఎం రేవంత్‌ రెడ్డి హామీ..

CM Revanth Reddy : వైద్యఆరోగ్య శాఖ మంత్రి నియామకాలు త్వరగా జరిగేలా చూశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. స్టాఫ్ నర్సులగా ఎంపిక అయిన వారికి సీఎం ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉండేవన్నారు. ఆ సమస్యను త్వరగా పరిష్కరించగలిగామని ఆయన తెలిపారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి పరిస్థితిపై సమీక్షించి నియామకాలు త్వరగా జరిగేలా చూశామన్నారు. ఉద్యోగ నియామకం వేళ మీ సంతోషంలో భాగస్వాములం అయినందుకు సంతోసంగా ఉందని సీఎం తెలిపారు.

CM Revanth Reddy : ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ .. సీఎం రేవంత్‌ రెడ్డి హామీ..
Advertisement

CM Revanth Reddy : టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలు అందజేసి సీఎం మాట్లాడారు.

వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉండేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ సమస్యను త్వరగా పరిష్కరించగలిగామని ఆయన తెలిపారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి సమీక్షించి నియామకాలు త్వరగా జరిగేలా చూశారన్నారు. ఉద్యోగ నియామకం వేళ మీ సంతోషంలో భాగస్వాములం అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వం వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచించిందన్నారు. నిరుద్యోగుల సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై గత ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందన్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×