E-Paper
Advertisement

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. రంగంలోకి సీఎం రేవంత్, ఆదిలాబాద్ నుంచి పర్యటన

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. రంగంలోకి సీఎం రేవంత్, ఆదిలాబాద్ నుంచి పర్యటన
Advertisement

CM Revanth Reddy: సంక్రాంతి ముగియడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. జనవరి 16న అనగా శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Advertisement

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది అధికార కాంగ్రెస్ పార్టీ . అదే ఊపులో మున్సిపాలిటీల్లో తమ జెండా ఎగుర వేయాలని భావిస్తోది. దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసింది. అదే ఊపులో 100 కు పైగా మున్సిపాలిటీల్లో పార్టీ జెండా ఎగుర వేయాలని భావిస్తోది. దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసింది.

శుక్రవారం నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా సదర్మాట్ బ్యారేజీ ప్రారంభం, చనాఖా కోర్టు ప్రాజెక్టు సందర్శన ఉండనుంది. ఆ తర్వాత నిర్మల్‌ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

Advertisement

మున్సిపల్ ఎన్నికల శంఖారావం అక్కడి నుంచే

శనివారం మహబూబ్ నగర్ జిల్లా, ఆదివారం ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించబోతున్నారు సీఎం. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల జాబితా విడుదల చేసింది. రిజర్వేషన్లు దాదాపుగా ఖరారయ్యాయి. వచ్చేవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే నియోజకవర్గాల మాదిరిగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడంతో అదే ఊపు కొనసాగించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి తామే వస్తున్నామంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ALSO READ: నుమాయిష్‌లో ధరల మంట. సామాన్యుడికి చక్కలు చూపిస్తున్న ఎగ్జిబిషన్ రేట్లు

ఇక బీజేపీ ఇప్పటికే జిల్లాల వారిగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసింది. ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటన చేయడంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కేడర్ కసరత్తు మొదలుపెట్టింది. నోటిఫికేషన్ రాగానే కీలక నేతలు దిగడం ఖాయమనే వాదన ఆ పార్టీ నుంచి బలంగా వినిపిస్తోంది. మొత్తానికి రెండు లేదా మూడు వారాలపాటు తెలంగాణలో ఎన్నికల సందడి ఊపందుకోనుంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×