E-Paper
Advertisement

Wanaparthy : సీఎం రేవంత్‌‌పై అభిమానం.. కాలినడకన శ్రీశైలానికి యువకుడు..

Wanaparthy : సీఎం రేవంత్‌‌పై అభిమానం.. కాలినడకన శ్రీశైలానికి యువకుడు..
Advertisement

Wanaparthy : రేవంత్‌ రెడ్డి సీఎం కావాలనే కోరిక నెరవేరినందున మొక్కు చెల్లించేందుకు బయల్దేరాడు ఓ యువకుడు. వనపర్తి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్రగా వెళ్తున్నాడు. ఈ నెల 7న ప్రారంభమైన ఈ నడక ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చేరుకుంది. ఎన్ని కష్టాలు పడైనా సరే తన మొక్కును చెల్లించుకుంటా అంటున్నాడు ఆ యువకుడు.

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానయపల్లికి చెందిన రాజు సీఎం రేవంత్‌కు వీరాభిమాని. ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని శ్రీశైల మల్లికార్జునుడికి మొక్కుకున్నాడు. ఆ తర్వాత వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్‌ విజయం సాధించడం… ఆ తర్వాత రేవంత్‌ సీఎం కావడం చకచకా జరిగిపోయాయి. దీంతో తన కోరిక తీరినందుకు మొక్కు చెల్లించేందుకు శ్రీశైలానికి బయల్దేరాడు రాజు. కానాయపల్లి నుంచి కాలినడకన రేవంత్‌ ఫోటో పట్టుకొని వెళ్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు పడైనా సరే శ్రీశైలానికి చేరుకుంటానని చెప్తున్నాడు రాజు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×