E-Paper
Advertisement

CM Revanth Reddy: అధికారం పోయినా బలుపు తగ్గలేదు.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: అధికారం పోయినా బలుపు తగ్గలేదు.. సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: పదేళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పంజాగుట్టలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం బయట కాదు..సచివాలయం లోపల పెడతామని రేవంత్ చెప్పారు. డిసెంబర్ 9 నాటికి సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.

రాజీవ్‌గాంధీ ఒక స్ఫూర్తి అని విప్లవాత్మమైన చైతన్యానికి రాజీవ్ గాంధీ ఆదర్శంగా పరిచయం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక కొంతమంది సన్నాసులు రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తామని మాట్లాడుతున్నారన్నారు. అధికారం పోయినా కొంతమందికి బలుపు తగ్గలేదని విమర్శించారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై ఎప్పుడు చేయివేస్తావో చెప్పాలని సవాల్ విసిరారు.

Advertisement

రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకున్న చోట.. కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ విగ్రహం పెట్టాలని అనుకున్నారని చెప్పారు. కేసీఆర్ సచ్చుడు ఎప్పుడు.. ఆయన విగ్రహం పెట్టేది ఎప్పుడంటూ ఎద్దేవా చేశారు. ఎవరైనా రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయి వేయండి.. చెప్పు తెగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.

Also Read: కవిత‌కు నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చేవారం

Advertisement

దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం తప్పా? అమరుల స్తూపం దగ్గర పెడితే తప్పా? అని అడిగారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటున్నారని, మా జగ్గన్నకు నీ బాధ్యత ఇస్తున్నానన్నారు మీ అయ్య తెలంగాణను పదేళ్లు దోచుకున్న దొంగ అని, సచివాలయం ముందు దొంగలకు తావు లేదన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×