E-Paper
Advertisement

CM Revanth Reddy: డిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్.. హస్తినకు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: డిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్.. హస్తినకు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: కాంగ్రెస్ ఓబీసీ జాతీయ సలహా మండలి భేటీ జనవరి మూడవ వారంలో హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ భేటీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఓబీసీ వర్గాలకు సంబంధించిన విధానాలు, రాజకీయ వ్యూహాలు, రానున్న ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ, సామాజిక న్యాయం అంశంపై స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

ఈ సమావేశానికి సంబంధించి తుది తేదీని ఖరారు చేయడానికి ఈనెల 27న ఢిల్లీలో జరిగే.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల అనంతరం ఓబీసీ జాతీయ సలహా మండలి ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ భేటీలో హైదరాబాద్ సమావేశానికి సంబంధించిన తేదీ, ఎజెండా, ఇతర ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం పార్టీ అగ్రనాయకత్వం.. ఈ సమావేశాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Advertisement

హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో ఓబీసీ జాతీయ సలహా మండలి ఎజెండాతో పాటు.. శిక్షణ తరగతులు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ సమావేశానికి హాజరై చర్చల్లో పాల్గొనాల్సిందిగా.. ఓబీసీ జాతీయ సలహా మండలి సభ్యుడు, మాజీ ఎంపీ హనుమంతరావుకు అధికారిక ఆహ్వానం అందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు దేశవ్యాప్తంగా పలువురు కీలక ఓబీసీ నేతలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశముంది.

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

ఇదిలా ఉండగా, ఈనెల 27న ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ అగ్రనాయకత్వంతో కీలక అంశాలపై చర్చించడమే కాకుండా, తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా ఆయన ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం.

సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలోని సంబంధిత శాఖల మంత్రులతో.. విడివిడిగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు వంటి అంశాలపై చర్చించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 28న రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారని, ఆ తర్వాత ఈనెల 29న జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై ప్రభుత్వం తరఫున సీఎం స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×