E-Paper
Advertisement

ఎంతటి వారినైనా.. అస్సలు వదిలిపెట్టం.. హైడ్రా వివాదంపై సీఎం క్లారిటీ!

ఎంతటి వారినైనా.. అస్సలు వదిలిపెట్టం.. హైడ్రా వివాదంపై సీఎం క్లారిటీ!
Advertisement

Revanth Reddy: ఢిల్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతున్న హైడ్రా వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని, ఈ పనులను మరింత వేగంగా కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. విపక్షాలు, ఆక్రమణదారులు ఎంత మొత్తుకున్నా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

పేదలైనా.. పెద్దలైనా వదిలేదే లేదు

Advertisement

తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద పాలనా సంస్కరణ హైడ్రా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కబ్జాకోరులకే హైడ్రా వద్దనిపిస్తోందని ఎద్దేవా చేశారు. గండిపేట, బతుకమ్మ కుంటలను ఆక్రమించింది సామాన్య పేద ప్రజలా? లేక బడా బాబులా? అని ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ ఎవరిదో అందరికీ తెలుసని, అది పేదలది కాదని నిలదీశారు. ఆక్రమణలకు పాల్పడినవారు ఎంతటి బడా బాబులైనా, పేదలైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు.

బిఆర్ఎస్ కుట్రలు.. హైడ్రాపై పూర్తి స్పష్టత

Advertisement

ఏ అధికారిని ఎక్కడ నియమించాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారమని రేవంత్ స్పష్టం చేశారు. గతంలో ఉన్నతాధికారి సోమేష్ కుమార్‌పై 400 పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. బిఆర్ఎస్ నేతలు కేవలం దురుద్దేశంతోనే కేసులు వేస్తూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి, తదుపరి కార్యాచరణను రూపొందిస్తామని వెల్లడించారు. హైడ్రాను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై తమకు పూర్తి స్పష్టత ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: శివరాజ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీపై కీలక చర్చ!

తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు

కబ్జారాయుళ్లకు మీడియా సంస్థలు కూడా సహకరించవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. కావాలని డబ్బులు గుమ్మరించి సోషల్ మీడియాలో హైడ్రాపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. చెరువుల పరిరక్షణ, భవిష్యత్ తరాల క్షేమం కోసమే ఈ నిర్ణయమని, ప్రజలు నిజాలను గ్రహించి మద్దతుగా నిలవాలని కోరారు.

అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం..

లోతుకుంట వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఎదురైన పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ, న్యాయ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోతుకుంట కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. చట్టపరమైన అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత, అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×