E-Paper
Advertisement

CM Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీని బొక్కలో వేయకుండా బీజేపీ ఎందుకు కాపాడుతోంది?: సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న!

CM Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీని బొక్కలో వేయకుండా బీజేపీ ఎందుకు కాపాడుతోంది?: సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న!
Advertisement

CM Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాల వైఖరిపై నిప్పులు చెరిగారు. “గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేశారు. ఎవరికైనా ఇల్లు వచ్చిందా? ఆయనకు మాత్రం ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ వచ్చింది, ఆయన కొడుక్కి, అల్లుడికి, బిడ్డకు ఫామ్ హౌస్‌లు వచ్చాయి. పేదల పట్ల ప్రేమ లేదు కాబట్టే గ్రామాల్లో ఇళ్లు కట్టలేదు” అని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే ‘బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి’ అని, చేసిన పాపాలు ఊరికే పోవని, ఆ ఊబిలోనే వాళ్లు కూరుకుపోతారని హెచ్చరించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తనను ‘రేవంత్ ఉద్దీన్’ అని పిలిచినా తనకు బాధ లేదని, తాను అందరి వాడినని పేర్కొన్నారు. అయితే, కిషన్ రెడ్డి ‘కల్వకుంట్ల కిషన్ రావు’గా మారి కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఈడీ కేసులతో వేధించిన బీజేపీ, లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు కాపాడుతోందని నిలదీశారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా జర్నలిస్టులను, జడ్జీలను బ్లాక్ మెయిల్ చేసిన సన్నాసుల మీద చర్యలు ఎందుకు లేవని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ.. “గల్లీలో మోరీ తీయాలంటే కేసీఆర్ వస్తాడా? లైట్ వేయాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా? ఓటు వేసేటప్పుడు పెళ్లి పెద్దని చూసి పిల్లని ఇస్తామా, పిల్లగాడిని చూసి ఇస్తామా?” అని చమత్కరించారు. మన గల్లీలో ఉండి పని చేసే గండ్ర సత్యనారాయణ లాంటి వారిని గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీలకు తమ ప్రభుత్వం రూ. 616 కోట్ల నిధులు ఇచ్చిందని, ఈ పనులన్నీ సజావుగా సాగాలంటే కౌన్సిలర్ తమ వాడై ఉండాలని స్పష్టం చేశారు.

అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ, 2027 గోదావరి పుష్కరాల కోసం బాసర నుండి భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం రూ. 3,000 నుండి రూ.  4,000 కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందని, ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, భూపాలపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Advertisement

Read Also: CM Revanth Reddy: ఆ వార్తల్లో వాస్తవం లేదు.. అపోహలు నమ్మొద్దు.. భూపాలపల్లి గడ్డపై రేవంత్ క్లారిటీ!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×