E-Paper
Advertisement

CM Revanth Diwali Wishes : పదేళ్ల చీకట్లను తరిమేశాం.. ప్రజలకు సీఎం దీపావళీ శుభాకాంక్షలు

CM Revanth Diwali Wishes : పదేళ్ల చీకట్లను తరిమేశాం.. ప్రజలకు సీఎం దీపావళీ శుభాకాంక్షలు
Advertisement

CM Revanth Diwali Wishesతెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళిని రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని కోరుకున్నారు. దీపాల కాంతులతో ప్రతి ఇంటింటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి.. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో దీపావళిని నిర్వహించుకోవాలని సూచించారు. చిన్నా, పెద్దా అంతా పండుగలో సంతోషంగా పాల్గొవాలని కోరిన ముఖ్యమంత్రి.. ఇటీవల జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, ప్రమాదాలకు తావు లేకుండా దీపాల పండుగను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే.. గత ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శాత్మకంగా వ్యాఖ్యాలు చేశారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం చోటుచేసుకుందన్న రేవంత్.. దాని తాలుకు చీకట్లు తొలిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అందరి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. తమ పరిపాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని ధీమా వ్యక్తం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×