E-Paper
Advertisement

KCR Convoy : కేసీఆర్ కాన్వాయ్ .. రూ. 66 కోట్ల.. 22 ల్యాండ్ క్రూయిజర్లు ..లోగుట్టు ఇదేనా?

KCR Convoy : కేసీఆర్ కాన్వాయ్ .. రూ. 66 కోట్ల.. 22 ల్యాండ్ క్రూయిజర్లు ..లోగుట్టు ఇదేనా?
Advertisement

KCR Convoy : మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాలను వెల్లడించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 66 కోట్ల రూపాయలతో 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి వాటిని విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ విషయాన్ని తాను సీఎం అయిన పది రోజుల వరకు కూడా తెలియదన్నారు. అయితే ఓ అధికారి చెప్పడంతో ఈ కాన్వాయ్ కొనుగోలు గురించి తెలిసిందని రేవంత్ రెడ్డి వెల్లడించడం అందరిని షాక్ కి గురి చేసింది.

మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉండగా తన కాన్వాయ్ కోసం 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి వాటికి బులెట్ ఫ్రూఫ్, శాటిలైట్ టెక్నాలజీ హంగులు.. చేయించేందుకు ఏపీలో గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని త్రిహయని ఇంజనీరింగ్‌ వర్క్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కు సీక్రెట్‌గా తరలించారు. అయితే ఊహించని రీతిలో ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవ్వడంతో ఆ విషయాన్ని గుట్టుచప్పుడుగా ఉంచారు. అయితే జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ ఆయన పొరుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు ఈ స్పెషల్ కాన్వాయ్ ను దాచిపెట్టారని భావిస్తున్నారు.

Advertisement

ఈ కాన్వాయ్ వ్యవహరంపై విచారణ చేపట్టిన అధికారులు.. త్వరలోనే సంబంధిత వివరాలను బయటపెట్టేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఆ అంశంపై ఏపీలోని అధికారులతో కూడా మాట్లాడి సదరు కంపెనీ ప్రతినిధితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కార్లను హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారని సమాచారం అందుతుంది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×