E-Paper
Advertisement

CM Revanth Reddy: ఆ విషయాలు కేసీఆర్‌ని అడగండి.. మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్

CM Revanth Reddy: ఆ విషయాలు కేసీఆర్‌ని అడగండి.. మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy Chit Chat: అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సభలో జరిగిన ఓ సన్నివేశంపై తెలంగాణలో హాట్ హాట్‌‌గా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై పలువురు ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. మాజీ సీఎం అయినా కేసీఆర్‌కు మంచి గౌరవం ఇచ్చారని అంటున్నారు. ఈ వ్యవహారంపై చర్చ జరుగుతున్న వేళ, అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు సీఎం రేవంత్.

అసెంబ్లీ లాబీల్లో సీఎం రేవంత్‌రెడ్డి చిట్ చాట్

Advertisement

సోమవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సభ నుంచి మాజీ సీఎం కేసీఆర్ బయటకు వచ్చేశారు. ఉన్నట్లుండి ఆయన ఆ విధంగా బయటకు రావడంతో ఒక్కసారి సభ్యులంతా షాకయ్యారు. చాలా సేపు తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి బయటకు వచ్చారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. తాను-కేసీఆర్ ఏం మాట్లాడుకున్న విషయాలు అక్కడే అడగాలన్నారు.

అక్కడ అడగాల్సిన విషయాలు ఇక్కడెందుకుని ముఖ్యమంత్రి అన్నారు. అయినా కేసీఆర్‌ని కలవడం మొదటిసారి కాదని, రెండోసారని గుర్తు చేశారు. కేసీఆర్ అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కలిశానని గుర్తు చేశారు. ఉన్నట్లుండి కేసీఆర్ సభ నుంచి వెంటనే ఎందుకు వెళ్ళారన్న దానిపై ఆయన్ని అడగాలన్నారు.

Advertisement

ఆ విషయాలు కేసీఆర్‌ని అడగండి, ఇది రెండోసారి

పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరిగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ యాక్సెస్ ఉంటుందన్నారు సీఎం. ప్రతి సభ్యుడ్ని తాము గౌరవిస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలకు కూడా సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఇదే సమయంలో బడ్జెట్ సమావేశాల వరకు మండలి కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రిని ప్రతిపక్షనేతలు వచ్చి కలుస్తారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్లడం, ఆయన్ని పలకరించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న తీరు సభలో చాలామంది నేతలను ఆకట్టుకుంది. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకు మాత్రమే, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అంటున్నారు.

ALSO READ:  ఈ జీవో ఎక్కడిది..  కృష్ణానదీ జలాల వివాదంలో బీఆర్ఎస్ గుట్టు బయటకు

ప్రతిపక్ష నేత సభకు రావాలని, అన్ని అంశాలపై చర్చిద్దామని పలుమార్లు చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎందుకో గానీ ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. సోమవారం సభలో కూడా అదే జరిగింది. రిజిస్టర్ బుక్‌లో సంతకం తర్వాత నేరుగా వెళ్లిపోయారు మాజీ సీఎం. అదే సమయంలో కేటీఆర్ వ్యవహారించిన తీరుపై సొంత పార్టీలో కొందరు నేతలు రకరకాలుగా గుసగుసలాడుకుంటున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×