E-Paper
Advertisement

రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ రెడీ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ రెడీ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Advertisement

బాసర క్షేత్రం సరికొత్త శోభను సంతరించుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాసరకు వెళ్లి సుమారు రూ.225 కోట్ల భారీ వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్షరాభ్యాసాలకు నిలయమైన ఈ పుణ్యక్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాస్టర్ ప్లాన్ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు కీలక సూచనలు జారీ చేశారు. భక్తుల విశ్వాసాలను అత్యున్నతంగా గౌరవిస్తూ ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని సీఎం స్పష్టం చేశారు. బాసర ఆలయ రూపురేఖలు అద్భుతంగా ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పరిసరాల్లో విశాలమైన రహదారులు నిర్మించాలని సూచించారు.

Advertisement

ఆలయ పవిత్రతను పర్యావరణాన్ని కాపాడటంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్ర పరిసరాల్లో వాయు కాలుష్యం లేకుండా కేవలం ఎలక్ట్రిక్ (EV) వాహనాలను మాత్రమే అనుమతించాలని ప్రతిపాదించారు. వాహనాల రాకపోకలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బాసర ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావులేకుండా నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగించే చర్యలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

చదువుల తల్లి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించేందుకు వచ్చే భక్తులకు ప్రపంచ స్థాయి వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. క్యూలైన్లు వసతి గృహాలు గోదావరి స్నాన ఘట్టాల ఆధునీకరణ పనుల్లో నాణ్యత పాటించాలని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ద్వారా బాసర క్షేత్రం దేశంలోనే అత్యుత్తమ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంకల్పంతో బాసర సరస్వతీ ఆలయం సరికొత్త వైభవాన్ని అందుకోబోతోంది.

Advertisement

ALSO READ: సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో హైటెన్షన్.. కూల్చివేతలపై భగ్గుమన్న వ్యాపారులు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×