E-Paper
Advertisement

CM Revanth Reddy: ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ, ఎయిర్‌పోర్టు.. నిర్మల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటనలు!

CM Revanth Reddy: ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ, ఎయిర్‌పోర్టు.. నిర్మల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటనలు!
Advertisement

CM Revanth Reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. నిర్మల్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి బాట’ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, ఈ ప్రాంత విద్యా, రవాణా రంగాలను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు.

 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేని లోటును తీరుస్తామని, జిల్లాకు విమానాశ్రయం (Airport) తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకోసం బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT) ఆవరణలోనే కొత్త యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదేశించారు.

Advertisement

పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నిర్మల్‌కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడి ప్రజల మద్దతు వల్లే తాను సీఎం అయ్యానని కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పోరాటాలకు, పౌరుషానికి నిలయమని, ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో కుమురం భీం ఇక్కడే పోరాడారని ఆయన కొనియాడారు. ఈ జిల్లాలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, బాసర ట్రిపుల్ ఐటీలోనే యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, ఇందుకు ప్రజాప్రతినిధులందరూ సహకరించాలని కోరారు. అలాగే ఆదిలాబాద్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, జిల్లాకు ఎయిర్‌పోర్టును తీసుకొస్తామని హామీ ఇచ్చారు. విమానాశ్రయం కోసం 10 వేల ఎకరాల భూమిని సేకరించాలని, దాని ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిద్దామని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి తీరాలని, జిల్లాకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రధాని మోదీని కలుస్తున్నానని, ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే రావాల్సిన ప్రాజెక్టులను అడుగుతున్నామని వివరించారు. ప్రధానిని పదే పదే కలుస్తున్నానని విమర్శించే వారికి స్పందిస్తూ.. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు ప్రధాని కాక ఇంకెవరు ఇస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కేంద్రంతో చర్చలు జరపకపోవడం వల్లే తెలంగాణకు నష్టం జరిగిందన్నారు. తనకు వ్యక్తిగత అజెండాలు లేవని, కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే మోదీ, అమిత్ షా సహా ఎవరినైనా కలుస్తానని తెల్చి చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని, ఆ తర్వాత అందరి లక్ష్యం అభివృద్ధి మాత్రమే కావాలని హితవు పలికారు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ప్రధానిని కలిసి తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలని సూచించారు.

Advertisement

 నిర్మల్ పట్టణంలో జరిగిన ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also: హైదరాబాద్ మెట్రో విస్తరణపై కిషన్ రెడ్డి కీలక లేఖ.. కేంద్రంతో కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×