E-Paper
Advertisement

BJP : బీజేపీ ఆశలపై మరోసారి నీళ్లు చల్లిన సీఎం రేవంత్!

BJP : బీజేపీ ఆశలపై మరోసారి నీళ్లు చల్లిన సీఎం రేవంత్!
Advertisement

రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకుని వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్న కమలం పార్టీకి సీఎం రేవంత్ సమయం చూసి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తున్నట్టు తెలుస్తున్నది. కేంద్రంలోని పెద్దలు సైతం అదే వ్యూహంతో రాష్ట్ర కేడర్‌కు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాము రెండోసారి అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ పదే పదే చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యిందని కాషాయ పార్టీ సమయం, సందర్భం దొరికినప్పుడల్లా ప్రచారం చేస్తున్నది. ఆరుగ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ప్రజలు విస్మరించారని, వారికి నమ్మకం ద్రోహం చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బీజేపీ బలపడకుండా రేవంత్ ప్లాన్..

ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్‌తో పోలిస్తే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల వలన బీజేపీకి గ్రామాల్లో పట్టుపెరిగింది. ఓటింగ్ పర్సంటేజీ సైతం పెరిగింది. ఇక మున్సిపాలిటీల్లో బీజేపీ పరవాలేదని పించింది.ఏకంగా కరీంనగర్ కార్పొరేషన్‌ను తన ఖాతాలో వేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో మెజార్టీ స్థానాలు సాధించినా.. మేజిక్ ఫిగర్ రాకపోవడంతో అక్కడ ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పొరేషన్లలో సత్తా చాటాలని భావించిన బీజేపీ దూకుడుకు సీఎం రేవంత్ బ్రేకులు వేశారు. ఎందుకంటే వరుసగా విజయాలు వరిస్తున్న పార్టీ పట్ల ప్రజల్లో ఎంతో కొంత పాజిటివిటి ఉంటుంది. దానిని దూరం చేయాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్టు టాక్.

కాంగ్రెస్ బలోపేతానికి చర్యలు..

Advertisement

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రాకుండా సీఎం రేవంత్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన కాంగ్రెస్.. 2029లో జరగబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సీఎం ఇప్పటినుంచే మార్గం సుగమం చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. అందుకే ‘ప్రజాపాలన-పట్టణప్రగతి’ పేరిట 99 రోజుల కార్యక్రమానికి ఆయన తెరలేపారు. సుమారు వంద రోజుల పాటు మంత్రులు, డీసీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నగరం, పట్టణం, పల్లెల్లో పర్యటించాల్సి ఉంటుంది. జనాలా సమస్యలను అడిగి వెంటనే పరిష్కారం అయ్యేవాటికి నిధులు మంజూరు చేయనున్నారు. ప్రజల సమస్యల పరిష్కారంతో పార్టీపై ఉన్న నెగెటివిటిని దూరం చేయాలని ముఖ్యమంత్రి చూస్తున్నట్టు సమాచారం.

Delhi liquor case: లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు!

ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా..

Advertisement

బీజేపీకి క్రమంగా మైలేజ్ పెరుగుతున్నందున..జనాల్లో ఆ పార్టీకి కనెక్షన్ తగ్గించాలంటే ఎన్నికలు ఇప్పట్లో ఉండకూడదు. దీంతో వారంతా వారి రోటీన్ పనుల్లో నిమగ్నం అయిపోతారు. ఈ క్రమంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను సీఎం వాయిదా వేసినట్టు సమాచారం. ముందుగా వంద రోజుల కార్యక్రమం పూర్తి చేసి జనాల సమస్యలు పరిష్కరిస్తే ఎన్నికల్లో బీజేపీ.. అధికార పార్టీ మీద విమర్శలు చేయడానికి ఆస్కారం ఉండదు. సమస్యలు పరిష్కారమైతే ఓటర్లే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. ఇదే వ్యూహాన్ని సీఎం ప్లాన్ చేయడమే కాకుండా ఆచరణలోనూ చూపించినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. ఎలాగైనా మరోసారి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×