E-Paper
Advertisement

Cm Revanth Reddy: నేడు యాదాద్రికి సీఎం.. మూసీ ప్రాంతంలో పాద‌యాత్ర‌.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Cm Revanth Reddy: నేడు యాదాద్రికి సీఎం.. మూసీ ప్రాంతంలో పాద‌యాత్ర‌.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Advertisement

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలో ప‌ర్య‌టించనున్నారు. ఈ రోజు సీఎం పుట్టినరోజు సంద‌ర్భంగా కుటుంబ స‌మేతంగా న‌ర‌సింహ‌స్వామివారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. త‌ర‌వాత ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మూసీ పున‌రుజ్జీవం కార్య‌క్ర‌మంలో భాగంగా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తారు. ఇప్ప‌టికే సీఎం ప‌ర్య‌ట‌న కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా పోలీసు భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

Also read: టీడీపీ స్కెచ్.. గుడివాడలో కొడాలి నాని అడ్రస్ గల్లంతేనా?

Advertisement

సీఎం ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే

ఉద‌యం 9 గంట‌ల‌కు రేవంత్ రెడ్డి కుటుంబ స‌మేతంగా బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్క‌డ నుండి 9.20 గంట‌ల‌కు యాద‌గిరిగుట్ట‌కు హెలిప్యాడ్ ద్వారా చేర‌తారు. అక్క‌డ నుండి వాహ‌నాల్లో 9.30 నుండి 10గంట‌ల వ‌ర‌కు ప్రెసిడెన్షియ‌ల్ సూట్ కు చేరుకుంటారు. 10.05గంట‌ల నుండి 11.15 గంట‌ల వ‌ర‌కు యాద‌గిరిగుట్ట ల‌క్ష్మి న‌ర‌సింహ‌స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొంటారు. 11.20 ప్రెసిడెన్షియ‌ల్ సూట్ కు చేరుకుని,11.30 గంట‌ల ఒంటిగంట వ‌ర‌కు వైటీడీఏ అధికారుల‌తో యాదాద్రి ఆల‌య అభివృద్ధిపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తారు.

Advertisement

అనంత‌రం హెలిప్యాడ్ వ‌ద్ద ఒంటి గంట నుండి భోజ‌నం చేయ‌నున్నారు. త‌ర‌వాత‌ 1.30 గంట‌ల‌కు ప్రెసిడెన్షియ‌ల్ సూట్ నుండి రోడ్డుమార్గంలో వ‌లిగొండ మండ‌లం సంగెం బ‌య‌లుదేరుతారు. 2.10 నుండి 3 గంట‌ల వ‌ర‌కు బీమ‌లింగం వ‌ద్ద పూజ‌ల్లో పాల్గొని, పాద‌యాత్ర చేప‌డ‌తారు. అక్క‌డ నుండి సీఎం మూసీ పున‌రుజ్జీవ సంక‌ల్ప యాత్ర‌ను ప్రారంభిస్తారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలోని ప్ర‌జ‌ల‌తో మాట్లాడి వారి అభిప్రాయాల‌ను సేక‌రిస్తారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే సీఎం పుట్టిన‌రోజు వేడుక‌లు ప్రారంభం అయ్యాయి. సీఎంకు కాంగ్రెస్ పార్టీ నేత‌లు, అభిమానులు బ‌ర్త్ డే విషెస్ చెబుతున్నారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×