E-Paper
Advertisement

CM KCR: రైతుల కోసం కేసీఆర్ కొత్త ప్రాజెక్ట్!.. ఎన్నికల కోసమేనా?

CM KCR: రైతుల కోసం కేసీఆర్ కొత్త ప్రాజెక్ట్!.. ఎన్నికల కోసమేనా?
Advertisement
cm kcr farmers

CM KCR: రైస్ మిల్లుల నిర్వహణలో సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నారు కేసీఆర్. ఇకపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైలు మిల్లులు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. వరి ధాన్యాన్ని పలు రకాల ఉత్పత్తులుగా మార్చేందుకు జిల్లాల వారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వరి పంటను మార్కెటింగ్‌ చేయటం ద్వారా రైతులను ధనవంతులను చేయనున్నట్లు తెలిపారు. 2వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు.

ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్న రాష్ట్ర రైతులు.. తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లో విక్రయించి లాభాలు ఆర్జించే స్థాయికి తీసుకెళ్తామన్నారు కేసీఆర్. ఈ మేరకు పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైస్‌ మిల్లులు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో వరి ధాన్యం నుంచి తయారు చేసే పలు రకాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ మేరకు మార్కెట్‌ విస్తరించే బాధ్యతను కార్పొరేషన్‌ నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కానుకగా రైతుల చెంతకే రైస్‌ మిల్లులు చేరి, పంటకు మరింత గిరాకీ పెంచేలా పలు నిర్ణయాలు తీసుకోనున్నారు కేసీఆర్.

Advertisement

వరి ధాన్యాన్ని ప్రాసెసింగ్‌ చేసే జపాన్‌కు చెందిన రైస్‌మిల్‌ కంపెనీ సటేక్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో కేసీఆర్‌ చర్చలు జరిపారు. 2వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి త్వరలోనే సీఎం శ్రీకారం చుట్టనున్నారు.

ఎన్నికల వేళ కావాలనే హడావుడి చేస్తున్నారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×