E-Paper
Advertisement

Suicide Attempt: ర్యాగింగ్ భయంతో.. ఐరన్ మాత్రలు మింగిన 8వ తరగతి బాలిక

Suicide Attempt: ర్యాగింగ్ భయంతో.. ఐరన్ మాత్రలు మింగిన 8వ తరగతి బాలిక
Advertisement

Suicide Attempt: స్వేచ్ఛ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో కలకలం రేగింది. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌ను తట్టుకోలేక 8వ తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆందోళనకు గురిచేసింది. వివరాల ప్రకారం బొల్లెపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కొంతకాలంగా సీనియర్ల వేధింపులకు గురవుతున్నట్లు తెలిసింది. ఈ కారణంగా తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె ఉదయం సమయంలో 16 ఐరన్ మాత్రలు మింగింది.

తల్లిదండ్రులు ఆందోళన

బాలిక అస్వస్థతకు గురైన విషయాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ లో ఉన్న సీరియల్స్.. కార్తీక దీపం 2 పరిస్థితి దారుణం..?

ర్యాగింగ్‌పై పర్యవేక్షణ

ర్యాగింగ్ ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం అంతర్గత విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనతో నివాస పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, కౌన్సెలింగ్ వ్యవస్థల అమలు ఎంత అవసరమో మరోసారి స్పష్టమైంది. ర్యాగింగ్‌పై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Also Read: Allu Sirish: పెళ్ళికొడుకు గెటప్ లో అల్లు శిరీష్.. అతిథులు ఎవరెవరంటే?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×