E-Paper
Advertisement

జోగిపేటలో టెక్షన్ టెన్షన్.. బీఫ్ వర్సెస్ మటన్ షాపుల వ్యవహారం, రెండు వర్గాల మధ్య ఘర్షణ

జోగిపేటలో టెక్షన్ టెన్షన్..  బీఫ్ వర్సెస్ మటన్ షాపుల వ్యవహారం, రెండు వర్గాల మధ్య ఘర్షణ
Advertisement

Sangareddy:  సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిన్నది మొదలై చివరకు పాకాన పడింది. కొట్టుకునే స్థితికి వెళ్లింది. కేవలం వ్యాపార ఆధిపత్యంపై నలుగుతున్న ఈ వ్యవహారం ముదిరింది. వ్యాపారులు కొట్టుకునే పరిస్థితికి చేరింది. అసలు మేటరేంటి? ఏం జరిగింది?

సంగారెడ్డి జిల్లా జోగిపేట్ పట్టణంలో గొడవలు-సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో బీఫ్-మటన్ దుకాణాల మధ్య గొడవ కొట్టుకునే వరకు వెళ్లింది. షాపుల ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అందోల్ ప్రాంతానికి చెందిన కటికే ముస్లింలు-జోగిపేటకు చెందిన ముస్లింల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Advertisement

బీఫ్ వర్సెస్ మటన్ షాపుల వ్యవహారం-చాన్నాళ్లుగా జరుగుతున్న ఈ వివాదం,  శనివారం నాటికి తారాస్థాయికి చేరింది. దీంతో ఇరువర్గాల షాపుల యజమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత హింసాత్మకంగా మారింది. వీరి గొడవను అదుపు చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రెండు వర్గాలు నేతలు ఎవరి మాట వినలేదు.

రెండు వర్గాల మధ్య ముస్లింల మధ్య గొడవలు-ఫలితంగా కర్రలు-కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో  జోగిపేటకు చెందిన పలువురు ముస్లిం వ్యాపారులు, యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత గొడవలు మళ్లీ మొదలయ్యాయి.

Advertisement

కర్రలు-కత్తులతో దాడులు, రంగంలోకి పోలీసులు-చికిత్స పొందుతున్న సమయంలో అందోల్‌కి చెందిన కటికే ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఆసుపత్రిలోకి చొరబడ్డారు. చికిత్స పొందిన బాధితులపై దాడికి దిగారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణం రణరంగంగా మారిపోయింది. అసలు గొడవలు ఏంటో తెలియక రోగులు-సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.

ALSO READ: షాబాద్‌లో ఆరుగురు హత్యలు.. వెలుగులోకి కొత్త విషయాలు, పదునైన కత్తితో- రెండు గంటల్లో

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. పోలీసులు భారీగా మోహరించడంతో  పరిస్థితిని అదుపులో ఉంది. ఈ ఘర్షణ విస్తరించకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. జోగిపేట పట్టణంలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×