E-Paper
Advertisement

ప్రభుత్వం పై ఆశావర్కర్లు ఫైర్.. కాంగ్రెస్ ఏడో హమీ అట్టర్ ఫ్లాప్ అంటూ..?

ప్రభుత్వం పై ఆశావర్కర్లు ఫైర్.. కాంగ్రెస్ ఏడో హమీ అట్టర్ ఫ్లాప్ అంటూ..?
Advertisement

ASHA Protest: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతోపాటు,7 వ హామీగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని హామీ ఇచ్చిందని, కానీ ప్రజాస్వామ్య పరిరక్షణలో దారుణంగా విఫలమైందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సి ఆర్ గోవింద్ రాజ్ అన్నారు. చలో హైదరాబాద్ సందర్భంగా హైదరాబాద్‌కు వెళ్లిన ఆశా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేయడానీ నిరసిస్తూ సోమవారం మక్తల్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆశా కార్యకర్తలకు 18 వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే ఆశా కార్యకర్తలపై అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.

ఏడవ హామీగా..

తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన ఆశలపై, రాష్ట్ర నాయకులపై నియంత్రత్వంగా వ్యవహరించి లాఠీచార్జ్ చేయడమే కాకుండా రాత్రి వరకు ఆడపడుచులను పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ఏడవ హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. కార్మిక వర్గ పోరాటాల పట్ల బాధ్యతరాహితంగా వ్యవహరించిన ఏ ప్రభుత్వము మనుగడ సాధించిన దాఖలాలు లేవన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి మిస్సింగ్ కార్యదర్శి, పుంజనూరు ఆంజనేయులు సిఐటియు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, భరత్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే ఆశా కార్యకర్తల ఇళ్ల దగ్గరికి వచ్చి అక్రమంగా అరెస్టులు చేయడమే కాకుండా మంచినీళ్లు కూడా ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లను నిర్బంధించారని విమర్శించారు.

Advertisement

Also Read: కోదాడలోని ఓ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న గ్రామస్తులు

ఫిక్స్డ్ వేతనం

తమను విస్మరించి తమ పోరాటాలను అణచివేసిన గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో గుర్తుతెరగాలని హెచ్చరించారు. తమకు ఫిక్స్డ్ వేతనం 18000 ఇచ్చేంతవరకు, అదనపు పని భారాలు తగ్గించాలని, మట్టి ఖర్చులకు 50,000, ఇన్సూరెన్స్ 50 లక్షల చెల్లించేంతవరకు తమ పోరాటం ఆగిబోదని తక్షణమే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో ఆశాలకు ప్రత్యేక నిధుల కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు గోవిందమ్మ, గౌరమ్మ, యశోద, అమీనా బేగం, ఇందిరా, అనురాధ, సుజాత, లక్ష్మి, నర్సింగమ్మ, వెంకటలక్ష్మి, పార్వతమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో దారుణం.. చీపిరితో విద్యార్థులను చితకబాదిన కూరగాయలు కోసే వ్యక్తి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×