E-Paper
Advertisement

CISF Jawan Dies Fire Gun Misfires: బస్సు దిగుతుండగా గన్ మిస్ ఫైర్.. సీఐఎస్ఎఫ్ జవాన్ మృతి

CISF Jawan Dies Fire Gun Misfires: బస్సు దిగుతుండగా గన్ మిస్ ఫైర్.. సీఐఎస్ఎఫ్ జవాన్ మృతి
Advertisement

CISF Jawan Dies Fire Gun Misfires: సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూరులో విషాదం చోటు చేసుకుంది. బస్సు దిగుతుండగా ఓ జవాన్ చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అయ్యింది. తూటా అతడి తలలోకి దూసుకెళ్లింది. దీంతో ఆ జవాన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల్లో వస్తున్న వివరాల ప్రకారం.. ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన వెంకటేశ్(34) అనే వ్యక్తి సీఐఎస్ఎఫ్ జవాన్ గా పనిచేస్తున్నాడు. శనివారం బెటాలియన్ బస్సు దిగుతుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు ఆయన చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అయ్యి తూటా తలలోకి దూసుకెళ్లింది. దీంతో ఆ జవాన్ అక్కడికక్కడే మృతిచెందాడని అధికారులు పేర్కొన్నారు. మృతునికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారని సమాచారం. 13 ఏళ్ల క్రితం వెంకటేశ్ ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. విషయం తెలిసి మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×