E-Paper
Advertisement

Bhupalpally: ఎస్సై అతి ఉత్సాహం.. డ్రంక్ అండ్ డ్రైవ్ బండిలో 55 రోజుల తర్వాత గుడుంబా ప్రత్యక్షం? అసలు నిజం ఏంటంటే..?

Bhupalpally: ఎస్సై అతి ఉత్సాహం.. డ్రంక్ అండ్ డ్రైవ్ బండిలో 55 రోజుల తర్వాత గుడుంబా ప్రత్యక్షం? అసలు నిజం ఏంటంటే..?
Advertisement

భూపాలపల్లి జిల్లాలో చట్టాన్ని రక్షించాల్సిన అధికారి, అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో నడుస్తూ బాధితులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. చిట్యాల మండల కేంద్రంలో ఎస్సై శ్రవణ్ రావు వ్యవహరిస్తున్న తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనంలో 55 రోజుల తర్వాత గుడుంబా దొరికిందని కేసు నమోదు చేయడం ఇప్పుడు పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగింది?

Advertisement

బాధితుల కథనం ప్రకారం.. గత ఏడాది నవంబర్ 21, 2025న చిట్యాల మండల కేంద్రంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వీరి వాహనం దొరికింది. ఆ సమయంలో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఎస్సై శ్రవణ్ రావు, మరుసటి రోజు ఉదయం వచ్చి బండి తీసుకెళ్లాలని చెప్పారు. తీరా మరుసటి రోజు వెళ్తే.. ఏదో ఒక సాకు చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఇలా రోజులు కాస్తా వారాలు.. వారాలు కాస్తా నెలలుగా మారి ఏకంగా 55 రోజులు గడిచిపోయాయి.

‘గుడుంబా’ కథ

Advertisement

ఇన్ని రోజులు బండి చుట్టూ తిరిగించుకున్న ఎస్సై, ఇప్పుడు అకస్మాత్తుగా ఒక కొత్త కథను తెరపైకి తెచ్చారు. సదరు వాహనంలో గుడుంబా దొరికిందని, అందుకే కేసు నమోదు చేస్తున్నామని చెప్పడంతో బాధితులు విస్తుపోయారు. 55 రోజుల పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనంలో ఇప్పుడు గుడుంబా ఎలా వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా నిషేధిత వస్తువులు దొరికితే, వాటితో పాటు నిందితులను ఉంచి ఫోటోలు తీసి మీడియాకు సమాచారం ఇవ్వడం నిబంధన. కానీ, అవేమీ లేకుండా ఇప్పుడు ఆకస్మాత్తుగా కేసు పెట్టడం వెనుక కుట్ర దాగి ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ ఒత్తిళ్లే కారణమా?

చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడిని సంతృప్తి పరచడానికే ఎస్సై శ్రవణ్ రావు తమపై కక్ష గట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు నాయకుడి ప్రోద్బలంతోనే ఎక్కడి నుంచో గుడుంబా తెచ్చి, తమ బండిలో దొరికినట్లు కట్టుకథ అల్లి తప్పుడు కేసు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయాన్ని తాము అంగీకరిస్తున్నామని, దానికి సంబంధించిన జరిమానా కట్టడానికి సిద్ధంగా ఉన్నామని.. కానీ లేని గుడుంబా కేసును తమపై రుద్దడం అన్యాయమని వారు వాపోతున్నారు.

పోలీస్ స్టేషన్‌లో వాహనం భద్రంగా ఉంటుందని నమ్మి వదిలేస్తే.. దానినే అడ్డం పెట్టుకొని ఎస్సై వేధింపులకు గురిచేయడంపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి, చిట్యాల ఎస్సై శ్రవణ్ రావుపై విచారణ జరపాలని, తప్పుడు కేసు నుంచి తమను రక్షించి, తమ వాహనాన్ని తమకు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.

ALSO READ: Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర వచ్చేస్తోంది.. త్వరలో భారీ పోలీస్ రిక్రూట్మెంట్, ప్రిపరేషన్ షురూ చేయండి..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×