E-Paper
Advertisement

రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేకపోతున్నారు.. అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ పని: చామల కిరణ్ రెడ్డి

రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేకపోతున్నారు.. అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ పని: చామల కిరణ్ రెడ్డి
Advertisement

Chamala Kiran Reddy:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై బీజేపీ నేత రామచంద్రరావు చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి హయాంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడం బీజేపీ నేతలకు ఇష్టం లేనట్టు కనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

హైదరాబాద్ నగర నడిబొడ్డున మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ, ఆధ్యాత్మికతను జోడించి ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని రామచంద్రరావు జీర్ణించుకోలేకపోతున్నారని కిరణ్ రెడ్డి విమర్శించారు. “రామేశ్వరం కట్టుకోండి.. ఓంకారేశ్వరం కట్టుకోండి.. కానీ ప్రజల సొమ్ముతో వద్దు” అని రామచంద్రరావు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని అడ్డుకోవాలనే ఆలోచన తప్ప, నగర అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కేవలం మీడియాలో ఉనికి చాటుకోవడానికే ఇటువంటి కన్స్ట్రక్టివ్ లేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు వాడకూడదన్న రామచంద్రరావు వాదనను కిరణ్ రెడ్డి తిప్పికొట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని వందల కోట్ల ప్రభుత్వ నిధులతో పునర్నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం తెలంగాణలోనే కాకుండా, దేశవ్యాప్తంగా గంగా నది ఘాట్లు, సబర్మతీ రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టుల కోసం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

బీజేపీ నేతలు బీఆర్ఎస్ వంత పాడుతున్నారని, సొంత ఆలోచనతో కాకుండా రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారని కిరణ్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న మార్పును చూసి తట్టుకోలేక, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఎవరూ బీజేపీ వైపు చూడటం లేదని, అందుకే ఏదో ఒక వివాదాన్ని సృష్టించి వార్తల్లో నిలవాలని రామచంద్రరావు తాపత్రయపడుతున్నారని అన్నారు. హైదరాబాద్ నగరం బాగుపడటం ఇష్టం లేని వారు మాత్రమే ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పట్టుదలతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Read Also: సీఎం తమ్ముడు, బావమరిదిపై విచారణకు సిద్ధమా?: హరీశ్‌రావు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×