E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల‌కు కేంద్రం షాక్.. పాస్ పోర్టులు స‌స్పెండ్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల‌కు కేంద్రం షాక్.. పాస్ పోర్టులు స‌స్పెండ్
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. నిందితులు ప్ర‌భాక‌ర్ రావు, శ్ర‌వ‌ణ్ రావు పాస్ పోర్టుల‌ను స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కీల‌క నిందితులుగా ఉన్న ప్ర‌భాక‌ర్ రావు, శ్ర‌వ‌ణ్ రావుల పాస్ పోర్ట్ ల‌ను రద్దు చేయాల‌ని పోలీసులు కేంద్రానికి సిఫార‌సు చేశారు. పాస్ పోర్ట్ ల సస్పెండ్ ను ప్రభాకర్ రావు స‌వాల్ చేశారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద ప్ర‌భాకర్ రావు త‌ర‌పున న్యాయ‌వాదులు పిటిషన్ దాఖలు చేశారు.

తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ప్రభాకర్ రావు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇక శ్ర‌వ‌ణ్ రావు త‌న‌కు కేసుతో సంబంధం లేద‌ని బెయిల్ మంజూరు చేయాల‌ని కోర్టును ఆశ్ర‌యించారు. మ‌రోవైపు ఇంట‌ర్ పోల్ ద్వారా ఇద్ద‌రినీ ఇండియాకు ర‌ప్పించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించి దేశానికి ర‌ప్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ అంశం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్, బీజేపీ నాయ‌కుల ఫోన్లను ట్యాపింగ్ చేసి అప్ప‌టి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో ప‌లువురు బాధితులు, నిందితుల‌ను అధికారులు విచారించారు. కానీ ఈ కేసులో ప్ర‌భాక‌ర్ రావు ఏ1గా ఉన్నారు. కేసు విచార‌ణ మొద‌ల‌వ్వ‌గానే ఆయ‌న అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో కేసు విచార‌ణ‌ను పూర్తి చేసి నిందితుల‌ను అదుపులోకి తీసుకోవాల‌ని చూస్తున్నారు. మ‌రోవైపు ఈ కేసులో శ్ర‌వ‌ణ్ రావు ఏ6గా ఉన్నారు. ఈయ‌న ఓ మీడియా సంస్థ అధినేత‌. ఈయ‌న కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఆరోప‌ణ‌ల‌తో అమెరికాకు వెళ్లిపోయారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×