E-Paper
Advertisement

Kishan reddy: అయ్యప్ప సన్నిథిలో బాలిక మృతి.. కేరళ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ

Kishan reddy: అయ్యప్ప సన్నిథిలో బాలిక మృతి.. కేరళ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ
Advertisement

Kishan reddy: ఇటీవల కేరళ అయ్యప్పస్వామి క్షేత్రంలో తొక్కిసలాటలో బాలిక మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కేరళ సీఎం పినరయి విజయన్ కు కేంద్ర సాంస్కతిక,పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. అయ్యప్ప స్వామి భక్తులు 40 రోజులు పాటు ఆధ్యాత్మిక భావనతో కూడిన మండల దీక్ష తర్వాత శబరిమలలో కొలువై ఉన్న స్వామి వారిని దర్శించుకోవడం కోసం భారతదేశంలో వివిధ ప్రాంతాలనుండి కోటిమందికి పైగా భక్తులు కేరళ కు వస్తుండగా.. తెలుగురాష్ట్రాల నుండి దాదాపు గా 15 లక్షలకు పైగా భక్తులు వస్తుంటారని లేఖలో పేర్కొన్నారు.

శబరిమలలో సరైన వసతులు లేకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్న విషయం పత్రికలు, ఛానల్స్ లో వస్తున్న వార్తలు ద్వారా తెలుసుకున్నాని.. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని కేరళ సీఎం పినరయి విజయన్ కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేంద్రం తరపు నుండి అన్ని విధాలుగా కేరళ ప్రభుత్వం కి సహకారం ఉంటుందని, భక్తులకు భోజనం, మంచినీరు, వైద్యం మొదలైనవి మెరుగుగా అందించాలని కోరారు. భక్తులకు సహాయం చేసేలా స్వచ్ఛంద సంస్థ సేవలను కూడా భాగస్వామ్యం చేసే దిశగా చొరవ తీసుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించి అన్ని రకాల సహాయ చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×