E-Paper
Advertisement

CCI: రైతులకు బిగ్ అలర్ట్.. పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించిన సీసీఐ..!

CCI: రైతులకు బిగ్ అలర్ట్.. పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించిన సీసీఐ..!
Advertisement

CCI: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను ఈ నెలాఖరు వరకు సీసీఐ పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ చివరి వరకు పత్తి కొనుగోళ్లను కొనసాగించాలని సీసీఐ అంగీకరించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల ప్రయోజనాలను ప్రాధాన్యంగా తీసుకొని కొనుగోళ్ల గడువును పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం, సీసీఐ దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. మీడియా ప్రకటన విడుదల చేశారు.

పత్తి సాగు ఆలస్యం..

రాష్ట్రంలో ఈ సీజన్‌లో పత్తి సాగు ఆలస్యంగా ప్రారంభమవడంతో దిగుబడులు కూడా ఆలస్యంగా మార్కెట్‌కు వస్తున్నాయని, ఈ వాస్తవ పరిస్థితిని కేంద్రానికి వివరిస్తూ కొనుగోళ్ల గడువును పొడిగించాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో రాష్ట్ర పరిస్థితిని వివరించి, రైతులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకొని రైతులు సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని మంత్రి కోరారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందనిస్పష్టం చేశారు.

Advertisement

Also Read: Manasa Varanasi : వైట్ శారీలో మెరిసిపోతున్న మానస.. చూపుతిప్పుకోవడం కష్టమే..

నాణ్యతా ప్రామాణాలు లేని పత్తి

రాష్ట్రంలో ఈ సంవత్సరం 45.32 లక్షల ఎకరాలలో పత్తిని సాగు చేయగా, 28.29 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఇప్పటివరకు 8,80,053 మంది రైతుల నుంచి రూ.12,823 కోట్ల విలువైన 16.15 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. అదేవిధంగా ఇప్పటివరకు మార్కెట్ ద్వారా 2.24 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యతా ప్రామాణాలు లేని పత్తిని కోనుగోలు చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో ఇంకా 9.99 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి రైతుల వద్ద ఉందని మార్కెటింగ్ అధికారులు అంచనా వేశారు.

Advertisement

Also Read: Rakul Preeth Singh : అబ్బా.. చీరలో రకుల్ ఎంత అందంగా ఉందో..రెండు కళ్లు చాలట్లేదు మావా..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×