// // Megha Construction| మేఘాకు ఝలక్.. రంగంలోకి సీబీఐ -->
E-Paper
Advertisement

Megha Construction: మేఘాకు ఝలక్.. రంగంలోకి సీబీఐ

Megha Construction: మేఘాకు ఝలక్.. రంగంలోకి సీబీఐ
Advertisement

CBI Filed A Case Against Megha Company Construction: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నాటి నుంచి నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులపై చర్చ మొదలైంది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ వైఫల్యాలూ ఒక్కొక్కటికగా బయటకు వస్తున్నాయి. నిర్మాణకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, అన్నారం, పంప్‌హౌస్‌లు మునిగిపోవటం.. గత ఏడాది అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగడం.. తాజాగా సుంకిశాల గోడ కూలిపోవటం వెనుక పనుల్లో మేఘా సంస్థ అవినీతి, నిర్లక్ష్యం బయట పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

తక్కువ సమయంలో పనులు పూర్తి చేసి రికార్డులు సాధించాలనే తపనే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు కాళేశ్వరంపై జ్యూడిషల్‌ ఎంక్వైరీ జరుగుతుండగా.. ఇప్పుడు సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోవటంతో గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులపైనా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వీటిలో మెజారిటీ ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థపైనా ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

డీపీఆర్‌కు అనుగుణంగా ప్రాజెక్టును నిర్మించటానికి బదులుగా ఇష్టారీతిగా ప్రాజెక్టు డిజైన్లు మార్చటం, పనులను దగ్గరుండి పర్యవేక్షించకపోవటం వంటి కారణాల వల్లే మేడిగడ్డకు ఈ దుస్థితి వచ్చిందని ఇరిగేషన్‌ నిపుణులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్‌ పద్దతిలో నచ్చివారికి కట్టబెట్టారనే వాదనలూ తెరపైకి వస్తున్నాయి. దీనికి తోడు పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల తప్పులు పునరావృతం అయ్యాయని వాదనలు ఉన్నాయి.

Also Read: టెన్షన్ లో మల్లారెడ్డి..యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన

Advertisement

అద్భుత నిర్మాణం అంటూ కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ సర్కారు.. పబ్లిసిటీ కారణంగానే మేడిగడ్డ కుంగిందనేది ఇంజినీర్లు చెబుతున్న మాట. దీని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ కేవలం మూడు రోజుల్లో 25 వేల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్‌ వర్క్ చేయటం కనీసం ఐదేళ్లయినా పట్టే కాళేశ్వరం రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని మూడేళ్లలోనే హడావిడిగా పూర్తి చేయటం వెను నిర్మాణ సంస్థల బాధ్యతా రాహిత్యమూ ఉందని నాటి ఇంజినీర్లే చెబుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకవైపు మేడిగడ్డ మీద విచారణ పూర్తికాకముందే మేఘా సంస్థ నిర్మించిన సుంకిశాల ప్రాజెక్టులోనూ భారీపంప్‌ హౌస్‌రిటైనింగ్‌ వాల్ కుప్పకూలటంతో మేఘా నిర్లక్ష్యంపై మళ్లీ చర్చ మొదలైంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×