E-Paper
Advertisement

Telangana: 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ

Telangana: 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ
Advertisement

Minister Damodar Rajanarsimha: జీవో 317 పై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమైంది. రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సబ్ కమిటీ సభ్యులు, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో 317 జీవోపై చర్చించారు. ఈ సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ జీవో 317 పై స్థానికతకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను కేబినెట్ సబ్ కమిటీ ముందు ప్రతిపాదించింది. ఈ అంశాలను సాధారణ పరిపాలన ముఖ్క్ష్య కార్యదర్శి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో సంప్రదించి తుది నివేదికను తమ ముందు సమర్పించాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది.

Advertisement

ఇక జీవో 46కు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో చర్చ చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ క్కా, శివశంకర్, బూసాని వెంకటేశ్వర రావు కేబినెట్ సబ్ కమిటీ కన్సల్టెంట్, జాయింట్ సెక్రెటరీ సర్వీసెస్, జీ సునీత దేవి, మల్లికార్జున్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read: ఎల్ఆర్ఎస్‌ విషయమై శుభవార్త చెప్పిన ప్రభుత్వం

Advertisement

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. పది జిల్లాలను 33 జిల్లాలకు పెంచింది. ఆ తర్వాత వెంటనే ఉద్యోగులను వర్క్ టు ఆర్డర్ పేరిట కేటాయింపులు జరిపింది. శాశ్వత కేటాయింపులు జరపలేదు. జిల్లాలతో పాటు ప్రభుత్వం కొత్త జోన్లు, మల్టీ జోన్లనూ తెచ్చింది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో తమకు నచ్చిన చోటుకు అధికారులు వెళ్లడానికి అవకాశం కల్పిస్తూ 317 జీవోను 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసింది. అందుకు దరఖాస్తులకు అంగీకరించింది. అయితే.. ఇక్కడ సీనియారిటీ, సీరియస్ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో డిమాండ్ ఉన్న చోటుకు ఎక్కువ సీనియారిటీ ఉన్న ఉద్యోగులు ఎంచుకుంటే.. తక్కువ సీనియారిటీ ఉన్న ఉద్యోగులకు ఆప్షన్స్ తక్కువయ్యాయి. ఇది వివాదానికి దారి తీసింది. వీటితోపాటు మరికొన్ని సమస్యలను ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు ముందుకు తెచ్చారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×