E-Paper
Advertisement

KTR: కేటీఆర్ సభలో బుల్లెట్ కలకలం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు..

KTR: కేటీఆర్ సభలో బుల్లెట్ కలకలం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు..
Advertisement

Karimnagar BRS Sabha: కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ సభలో అపశృతి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నిర్వహించిన  ర్యాలీలో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. బుల్లెట్ వాహనం రేస్ చేస్తూ జనాలపైకి దూసుకెళ్లాడు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ను బుల్లెట్ వాహనం ఢీకొంది. దీంతో కానిస్టేబుల్ తీవ్రగాయాలు అయ్యాయి.

వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే సభ ప్రారంభానికి ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు మానేరు వంతెన నుంచి సభా స్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో పాల్గొన్న కరీంనగర్, కోతి రాంపూర్ కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు తన బుల్లెట్ బైక్ తో ర్యాలీలో బీభత్సం సృష్టించాడు. బుల్లెట్ బైక్ ను ఒక్కసారిగా రేస్ చేస్తూ.. జనం పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పద్మజా అనే కానిస్టేబుల్ ను బుల్లెట్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడింది. ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్ పద్మజను హుటా హుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  ప్రమాదంలో కానిస్టేబుల్ కాలు విరిగినట్టు వైద్యులు తెలిపారు. దీంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది శ్రీకాంత్ ను పట్టుకుని బుల్లెట్ బైక్ ను స్వాధీనం చేసుకుని అతడ్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

ALSO READ: RRB Recruitment: టెన్త్, ఐటీఐ, డిగ్రీ అర్హతతో రైల్వేలో 9970 ఉద్యోగాలు.. భారీ వేతనం.. పూర్తి వివరాలివే..

ALSO READ: BOI Recruitment: మంచి అవకాశం.. డిగ్రీ అర్హతతో 400 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×