// // Student Suicide : వేధింపులకు మరొకరు బలి.. వరంగల్ లో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Student Suicide : వేధింపులకు మరొకరు బలి.. వరంగల్ లో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Student Suicide : వేధింపులకు మరొకరు బలి.. వరంగల్ లో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..
Advertisement

Student Suicide : తెలంగాణలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ లో ఈ విషాదరకర ఘటన జరిగింది. రక్షిత అనే బీటెక్ విద్యార్థి ఉరేసుకుని చనిపోయింది. ఓ యువకుడి వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లికి చెందిన పబ్బోజు శంకర్ , రమాదేవి దంపతుల కుమార్తె రక్షిత నర్సంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో ఏడాది చదువుతోంది. అక్కడే హాస్టల్ లో ఉంటోంది. పదో తరగతి చదివేటప్పుడు ఆమెకు పరిచమైన రాహుల్ అనే యువకుడు ఈ మధ్యకాలంలో ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. ఈ విషయాన్ని రక్షిత కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. వారు భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువకుడిని స్టేషన్ కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

Advertisement

పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత రాహుల్ నుంచి రక్షితకు వేధింపులు ఆగలేదు. శివరాత్రి రోజు రక్షిత కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పింది. కానీ ఆమె కళాశాలకు వెళ్లలేదు. దీంతో తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల తర్వాత ఆమె తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత వరంగల్ లోని రామన్నపేటలోని తన సోదరుడి ఇంటికి తండ్రి శంకర్ ఆమెను పంపించారు. మిస్సింగ్ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి సమయంలో రక్షిత తన బాబాయ్ ఇంట్లోనే ఉరేసుకుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×