E-Paper
Advertisement

Murder : నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి.. హైదరాబాద్‌లో దారుణ హత్య..

Murder : నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి.. హైదరాబాద్‌లో దారుణ హత్య..
Advertisement

Murder : పట్టపగలు హైదరాబాద్ లో దారణ హత్య జరిగింది. ముగ్గురు వ్యక్తులు కత్తులు, వేట కొడవళ్లతో ..ఒక వ్యక్తిని వెంటాడారు. ఒక్కసారిగా చుట్టిముట్టి నడిరోడ్డుపై నరికి చంపారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పురానాపూల్‌ సమీపంలో జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఈ దారుణం జరిగింది. జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తుండగా.. అతన్ని మరో ముగ్గురు వెంటాడారు. ఒక్కసారిగా చుట్టుముట్టి కత్తులు, వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికేశారు.

కుల్సుంపుర పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుడి ఆధార్‌ కార్డు ఆధారంగా కోఠి ఇస్తామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్‌(32)గా గుర్తించారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిందితులు ఎవరు? ఎందుకు అతన్ని హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని కుల్సుంపుర సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి దూరం నుంచి వీడియో తీశారు. ముగ్గురు చుట్టుముట్టి ఒక వ్యక్తిని కిరాతకంగా నరుకుతున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. పోలీసుల దర్యాప్తునకు ఈ వీడియో కీలకంగా మారింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×