E-Paper
Advertisement

KTR : సుదీర్ఘ ఆలోచనలో కేటీఆర్..!

KTR : సుదీర్ఘ ఆలోచనలో కేటీఆర్..!
Advertisement

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం సుదీర్ఘ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, పార్టీలో సమస్యలు, అంతర్గత వ్యవహారాలు, కేడర్‌లో నిరాశ, వెంటాడుతున్న కేసులు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీని ఏవిధంగా నష్టపరుస్తున్నదో అనే అంశాల పరిష్కారానికి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి జరిగిన నష్టం, మరోసారి పార్టీకి ప్రజలు చాన్స్ ఇస్తారా? లేదా? అనే అంశాలు ఆయన్ను పదే పదే వెంటాడుతున్నాయని ప్రచారం జరుగుతోంది.2029 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ ధీమా చెబుతున్నది. కానీ, లోలోపల మాత్రం భయం వెంటాడుతున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ అసంతృప్తి..

ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. అధికార పార్టీ కంటే ఎక్కువగా స్థానాలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ భావించింది.కానీ, కేడర్‌లో నిరాశో లేక క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతో లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ చేసిన అవినీతిని ప్రజలకు చూపించడం వలన వారికి ఆదరణ తగ్గినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా, ఈ ఎన్నికల బాధ్యతలను కేటీఆర్ తన భుజాల మీద వేసుకుని ప్రచారం చేపట్టారు. అయినప్పటికీ ఉత్తర తెలంగాణలో గతంలో ఆ పార్టీకి ఉన్న బలం కాస్త తగ్గిపోయింది. అక్కడి ఓటర్లు బీజేపీకి దగ్గరయ్యారు.ఉత్తర తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటోంది. ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట సీట్లు తగ్గడంపై కేసీఆర్ నరాజ్ అయినట్టు సమాచారం.

Advertisement

కాగా, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ పోస్టుమార్టం చేపట్టినట్టు తెలుస్తున్నది. స్థానికంగా ఉన్న లీడర్ల పొరపాటా? లేక నిజంగానే గ్రౌండ్‌లో బీఆర్ఎస్ పార్టీ మీద ఆదరణ తగ్గిపోతుందా? అనే భయం అటు కేసీఆర్..ఇటు కేటీఆర్‌‌ను వెంటాడుతున్నట్టు తెలుస్తుండగా.. పార్టీలో ప్రక్షాళన చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.ఈ క్రమంలోనే కేటీఆర్ పార్టీ వ్యవహారాలపై సంస్థాగతంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పార్టీ కేడర్‌కు హింట్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తున్నది. కేడర్ సైతం కొందరు నేతల నిర్లక్ష్యం వల్లే పార్టీ వరుసగా ఓటమి పాలవుతోందని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

Atchennaidu vs Council Chairman: ఏపీ మండలిలో లడ్డూ రగడ.. మండలి చైర్మన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Advertisement

మరో రెండున్నర ఏండ్లలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి జమిలి ఎలక్షన్స్ ఉంటాయని సీఎం రేవంత్ పదే పదే అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే జాతీయ పార్టీలకు అనుకూలంగా ఫలితాలు రావొచ్చని, ప్రజల మైండ్ సైట్‌ ఆధారంగా రిజల్ట్స్ ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలని ఇప్పటినుంచే కేటీఆర్ ఆలోచనలో పడినట్టు సమాచారం. దీనిపై కేసీఆర్, హరీశ్ రావులు సైతం కేటీఆర్‌తో సమాలోచనలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.జాతీయ పార్టీలకు చాన్స్ ఇవ్వకుండా, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణకు రక్షణ కవచంలా నిలుస్తుందనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గులాబీ బాస్.. కేటీఆర్, హరీశ్ రావులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×